ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఐజీ లేఅవుట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతాం

ABN, First Publish Date - 2022-08-05T05:27:52+05:30

మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద ఏర్పాటు చేస్తున్న మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు(ఎంఐ జీ) లేఅవుట్‌ను మోడల్‌ లేఅవుట్‌గా తీర్చి దిద్దుతామని ఆర్డీవో ఎంఎస్‌ మురళి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 4: మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద ఏర్పాటు చేస్తున్న మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు(ఎంఐ జీ) లేఅవుట్‌ను మోడల్‌ లేఅవుట్‌గా తీర్చి దిద్దుతామని ఆర్డీవో ఎంఎస్‌ మురళి పేర్కొన్నారు. గురువారం స్థానిక సబ్‌ కలెక్ట రేట్‌లో పోతబోలు పంచాయతీ పరిధిలోని రైతులతో ఆర్డీవో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐజీ లేఅవుట్‌ కోసం 3 ఎకరాల ప్రభుత్వ స్థలంతో పాటు 19 ఎకరాల రైతుల భూములు తీసుకుంటున్నామన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారంగా ఎకరాకు రూ.12లక్షలు చెల్లిస్తామని అలా వద్దంటే ఎంఐజీ లేఅవుట్‌ వేశాక ఎకరా భూమి ఇచ్చిన రైతుకు 22శాతం ఫ్లాట్లను వారు కోరిన చోట కేటాయి స్తామన్నారు. ఈ లేఅవుట్‌ను 40 అడుగుల వెడల్పైన రోడ్లతో, కమ్యూనిటీ స్థలాలు వదిలి అభివృద్ధి చేస్తామన్నారు. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు లబ్ధిదారులకు కేటాయించే టప్పుడు అప్పుడు వున్న మార్కెట్‌ ధర ప్రకారం ఫ్లాట్లను కేటాయిస్తామన్నారు.  రైతు లకు అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంఐజీ ప్రతినిధి కుముదిని, పోతబోలు సర్పంచ్‌ ఈశ్వరయ్య, రైతులు పాల్గొన్నారు.

ఓటరు నమోదుకు సహకరించండి : ఆర్డీఓ


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 4: అన్ని రాజకీయ పార్టీల ప్రతినిఽధులు ఓటరు నమోదు కార్యక్రమానికి సహకరించాలని ఆర్డీవో మురళి పేర్కొన్నారు. గురువారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఓటరు కార్డు పంపిణీకి ఎన్నికల సంఘం నిర్ణయించిందని, దీనికి 14 గుర్తింపు కార్డులతో ఏదేని ఒక దానితో కలర్‌ ఫొటోలతో ఓటరు గుర్తింపు కార్డు తయారు చేసి పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు రాజకీయ పార్టీల అభ్యంతరాలను తెలుపాలన్నారు. టీడీపీ నాయకులు పర్వీన్‌తాజ్‌, ఆర్‌జే వెంకటేశ్‌, సురేంద్రయాదవ్‌లు మాట్లాడుతూ ఆధార్‌కార్డు మినహా, మిగిలిన ఏదేని ఒక కార్డుతో ఓటరు గుర్తింపు కార్డు ఇస్తే బాగుం టుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

కలకడలో:ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండలంలో జరుగనున్న ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని తహశీల్దార్‌ వెంక టపతి కోరారు. గురువారం ఆయన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయ కులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో బీఎల్వోలు ఫారం-6బి ద్వారా వివరాలను సేకరిస్తారని ఇందుకు గాను ఓటర్లు బీఎల్వోలకు సహకరించి తమ స్వీయ సంతకం చేసిన ఆధార్‌ జిరాక్స్‌ను అందించాలన్నారు. ఆర్‌ఐ కమలాకర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising