ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర దినోత్సవ మహార్యాలీని విజయవంతం చేద్దాం

ABN, First Publish Date - 2022-08-11T04:40:20+05:30

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం మదనపల్లెలో నిర్వహించనున్న మహార్యాలీని విజయవంతం చేద్దామని ఆర్డీవో ఎంఎస్‌ మురళి పిలుపునిచ్చారు.

అధికారులకు సూచనలిస్తున్న ఆర్డీవో మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 10: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం మదనపల్లెలో నిర్వహించనున్న మహార్యాలీని విజయవంతం చేద్దామని ఆర్డీవో ఎంఎస్‌ మురళి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో అన్ని ప్రభుత్వశాఖల హెచ్‌వో డీలతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు 10 వేల మందితో మదనపల్లె పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నామ న్నారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌ నుంచి బయలుదేరే ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండు, టౌన్‌ బ్యాంకు సర్కిల్‌, బెంగళూరు బస్టాండు, బీటీ కళాశాల, నీరుగట్టువారిపల్లె, మాయా బజార్‌ మీదుగా రింగ్‌రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండు చేరుకుంటుదన్నారు. ఈ ర్యాలీలో సాంస్కృతిక ప్రదర్శనలు, బ్యాండు, మేళతాళా లు, తదితర అంశాలతో దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు ఆ టంకం లేకుండా క్రమశిక్షణలో ర్యాలీ సాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేస్తున్న వేదిక, ప్రముఖు లకు, ప్రజ లకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులు ప్రణాళికబద్ధంగా నిర్వ హించాలన్నారు. ఎంవీఐ దినేష్‌చంద్ర, పీఆర్‌ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T04:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising