ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సమస్యలకు ఆధారాలు ఉండాలి: ఆర్డీవో

ABN, First Publish Date - 2022-09-27T05:01:31+05:30

భూసమ స్యలపై స్పందనకు వచ్చే ఫిర్యాదులకు ఆధారాలు జతపరచాలని ఆర్డీవో మురళి సూచించారు.

్ఠస్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఆర్డీవో మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 26: భూసమ స్యలపై స్పందనకు వచ్చే ఫిర్యాదులకు ఆధారాలు జతపరచాలని ఆర్డీవో మురళి సూచించారు. సోమవా రం స్థానిక సబ్‌కలె క్టరేట్‌లో నిర్వహిం చిన స్పందన కార్యక్రమానికి డివిజన్‌లో ని 11 మండలాల నుంచి 42 మంది ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సంద ర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పలు గ్రా మాల నుంచి వ్యక్తిగతంగా ప్రజలు భూ సమస్యలపై అర్జీలు ఇస్తున్నారే కాని, ఆధారా లు ఇవ్వడం లేదని దీని వల్ల నిర్దేశిత సమయంలోపు స్పందన అర్జీలు పరిష్కరించడం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.  నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె రెండో వార్డులో దళితులు నివశిస్తున్న ప్రదేశంలో పేదదిబ్బల వద్ద పంచాయతీ తాగునీ టి కుళాయి ఏర్పాటు చేశారని, ఈ నీరు తాగిన ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారని పీపల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ వ్యవస్థాపకుడు వి.చలపతి ఫిర్యాదు చేశారు. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించలేదని, ఇళ్ల ముందు చెత్తదిబ్బలు పేరుకుపోయాయని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.  వాల్మీకి పురం మండల కేంద్రంలోని ఏపీఆర్‌జేసీ ఉర్దూ మీడియం కళాశాలలో సౌకర్యాల నిర్వ హణ అస్థవ్యస్తంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు  ఫిర్యాదు చేశారు.

మదనపల్లె రూరల్‌: మదనపల్లె మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఐదు సమస్యలపై వినతులు వచ్చినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వి.మనూజ, కమిషనర్‌ ప్రమీల తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆర్‌ఆర్‌ కాలనీలో కుక్క ల బెడద ఎక్కువగా ఉందని, ఫాగింగ్‌ చేయాలని, నిమ్మనపల్లె రోడ్డు ఏరియాలో 60అడుగుల రోడ్డు నిర్మించాలని, ప్రశాంత్‌నగర్‌లో మురుగు కాలువలు నిర్మించాలని, శారదానగర్‌లో వీధిలైట్లు వేయాలనే సమస్యలు వచ్చాయని తెలిపారు.   కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T05:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising