ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమకు అంబేడ్కర్‌ పేరు కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-05-27T04:55:50+05:30

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును కొనసాగించాలని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోసా మనోహర్‌ పేర్కొ న్నారు.

మైదుకూరు రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న మాలమహానాడు నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, మే 26 : కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును కొనసాగించాలని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోసా మనోహర్‌ పేర్కొ న్నారు. గురువారం మైదుకూరు రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే కొందరు ఓర్చుకోలేక విధ్వంసాల కు పాల్పడ్డారని, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టడం దారుణ మన్నారు. అమలాపురంలో విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దానమ్మ, సావిత్రి సురేష్‌, వినోద్‌, రాజేష్‌, మధు, జ్యోతి, కొండబాబు తదిత రులు పాల్గొన్నారు. 

ప్రొద్దుటూరు క్రైం : కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని దళిత, బహుజన, ప్రజాసంఘాల నేతలు డిమాండు చేశారు.  గురువారం పాతబస్టాండు సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద వారు కోన సీమలో విధ్వంసంపై నిరసన వ్యక్తం చేశారు.  అగ్రవర్ణ శక్తులకు కొన్ని రాజకీయ శక్తులు తోడై, దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సుధాకర్‌, రాష్ట్ర మాలమహానాడు నాయకులు ఇమ్మాన్యుయేల్‌, సంచారజాతుల సంఘం కన్వీనర్‌ పసుపులేటి శివకృష్ణ, దళితసైన్యం నాయకులు సుదర్శన్‌, మురళీప్రసాద్‌, సుధాకర్‌, పలువురు మేధావులు పాల్గొన్నారు.

చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్న వైసీపీ

ప్రొద్దుటూరు అర్బన్‌: కోనసీమలో చిచ్చుపెట్టి వైసీపీ చోద్యం చూస్తున్నదని కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ నజీర్‌ ఆరోపించారు. గురువారం ఆ యన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడు తూ ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ పేర జిల్లాలు పెట్టినప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెడితే ఎందు కు ఇంత అల్లర్లు జరుగుతున్నాయో ఆలోచించాల న్నారు. సమాజం ఇంకా కుల ప్రభావాల్లో కూరుకుపోతున్నది తప్ప ప్రజా స్వామ్య యుతంగా ఎదగలేదన్నారు. ఈ అల్లర్లకు కారణం ఎవరైనా వదిలిపెట్టరాదని ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2022-05-27T04:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising