ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లాప్‌ మిత్రలకు పది నెలలుగా జీతాల్లేవ్‌

ABN, First Publish Date - 2022-08-02T05:19:31+05:30

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకోసం పనిచేస్తున్న క్లాప్‌ మిత్రలకు 10 నెలలుగా వేతనాలు రాలేదు. వీరికి వేతనాలు చెల్లించడంతో పాటు కనీస వేతనం రూ.10 ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛభారత్‌ కార్మికుల యూనియన్‌

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంటనే చెల్లించాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా 

కడప(ఎర్రముక్కపల్లి), ఆగస్టు 1: స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకోసం పనిచేస్తున్న క్లాప్‌ మిత్రలకు 10 నెలలుగా వేతనాలు రాలేదు. వీరికి వేతనాలు చెల్లించడంతో పాటు కనీస వేతనం రూ.10 ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛభారత్‌ కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జె.హనుమంతు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు జి.వేణుగోపాల్‌, యూనియన్‌ గౌరవాధ్యక్షుడు కేసీ బాదుల్లా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అధిక మండలాల్లో క్లాప్‌ మిత్ర కార్మికులకు 8 నెలల నుంచి 10 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వేతనాలు అందని కారణంగా కొన్ని పంచాయతీలలో క్లాప్‌ మిత్ర కార్మికులు విధుల్లోకి పోవడం లేదన్నారు. వీరికి మున్సిపల్‌ కార్మికుల మాదిరిగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 680 ప్రకారం కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు పి.సుబ్బరాయుడు, స్వచ్ఛభారత్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, రెడ్డయ్య, ఆనందయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-02T05:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising