కరణం మల్లీశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలి
ABN, First Publish Date - 2022-03-06T04:36:25+05:30
నేటి తరం వెయిట్‌లిఫ్టర్‌లు కరణం మల్లీశ్వరిని ఆద ర్శంగా తీసుకుని తద్వా రా మనదేశ కీర్తిని చాటాలని జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ తెలిపారు.
వెయిట్ లిఫ్టింగ్ పోటీల ప్రారంభోత్సవంలో జేసీ
కడప (మారుతీనగర్), మార్చి 5 : నేటి తరం వెయిట్‌లిఫ్టర్‌లు కరణం మల్లీశ్వరిని ఆద ర్శంగా తీసుకుని తద్వా రా మనదేశ కీర్తిని చాటాలని జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ తెలిపారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు శనివారం స్థానిక డీఎ్‌సఏ మైదానంలో శాప్ రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ లీగ్ (అండర్-17 బాల, బాలికలకు) పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఏదైనా సాధించాలంటే సాధన, అంకితభావం మెండుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో స్టెప్ సీఈవో రామచంద్రారెడ్డి, డీఎ్‌సఏ చీఫ్ కోచ్ బాషామొహిద్దీన్, వివిఽధ జిల్లాల నుంచి శాప్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌లతో పాటు కార్పొరేటర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T04:36:25+05:30 IST