ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమనీయం నృసింహుడి కల్యాణం

ABN, First Publish Date - 2022-05-15T05:26:00+05:30

మదనపల్లె పట్టణంలోని అనపగుట్టలో వెలసి ఉన్న అభయలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని కమనీయంగా వైభవంగా నిర్వహించారు.

మదనపల్లెలో ప్రత్యేక అలంకరణలో లక్ష్మీనరసింహస్వామివారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, మే 14:మదనపల్లె పట్టణంలోని అనపగుట్టలో వెలసి ఉన్న అభయలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం  స్వామివారి కల్యాణోత్సవాన్ని కమనీయంగా వైభవంగా నిర్వహించారు. అంతకు మ ఉందు ఆలయకమిటీ అధ్యక్షుడు, ఆలయ ప్రధాన అర్చకుడు సోంపల్లె రమేష్‌ ఆధ్వర్యంలో నృసింహ జయంత్యుత్సవాలను వేడుకగా భక్తిశ్రద్ధల తో నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువజాము నుంచి  ఆలయం లోని స్వామివారికిపంచామృతాభిషేకం,నరసింహ హోమం, 8గంటలకు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు, ప్రజలు స్వామివారి కల్యాణం కనులారా తిలకించి  ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే మల్లికార్జున సర్కిల్‌ సమీపంలోని వరాలఆంజనేయస్వామి ఆలయంలో నృసింహజయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. 



హంస వాహనంపై భక్తులకు కటాక్షం

చిన్న తిప్పసముద్రంలో వెలసిన లక్ష్మీనరసంహస్వామి ఆలయంలో శనివారం వార్షికబ్రహోత్సవాల్లో భాగంగా హంసవాహనంపై నృసింహస్వామి భక్తులకు కటాక్షించారు. అంతకు ముందు ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు రుషికేశవస్వామి నరసింహస్వామికి వసంతోత్సవం జరిపించారు. అనంతరం చక్రస్నానం చేయించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అధికసంఖ్యలో భ క్తులు స్వామవారిని దర్శంచుకున్నారు. 

పెద్దతిప్పసముద్రంలో: మండలంలోని కందుకూరులో వెలసిన శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ త్రయోదశి నరసింహా జయంతి సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు  ముందు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి  అభిషేకం చేయించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు. 

పెద్దమండ్యంలో:  పెద్దమండ్యం మండలం పాపేపల్లిలో  ప్రసిద్ది చెంది న లక్ష్మీ నరసింహస్వామి  ఆలయంలో శనివారం స్వామివారి కల్యా ణోత్సవం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహిం చారు. నరసింహ జయంతి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అభి షేకాలు, ప్రత్యేక  పూజలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా గాలీవీడు కు చెందిన తంగాల వెంకటరత్యం, సునీల్‌కుమార్‌, శ్రీహరిబాబు సోదరుల కుటుంబ సభ్యుల అధ్వర్యంలో స్వామి వారి కల్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.  రాత్రి పాపేపల్లి పురవీధులలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, బాణసంచాలు, చెక్కభజలతో ఊరేగింపు  జరిగింది.  కార్యక్రమంలో ఎంపీటీసీ గీత, విశ్రాంత ఉద్యోగి క్రిష్ణారెడ్డి, శిరిషా, రామిరెడ్డి, నరసింహులు, నాగరాజు సుబ్యరామయ్య, అర్చకులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.   

నరసింహస్వామి సన్నిధిలో పుష్పగిరి పీఠాధిపతి

గుర్రంకొండ, మే 14:గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారిని శనివారం పుష్పగిరి పీఠాధిపతి మదబీన ఉద్దండ విద్యాశంకర భారతి స్వామి వారు దర్శించుకొన్నారు. ఈ క్రమంలో ఆయన కు టీటీడీ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు.  కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ ముని చెంగల్‌రాయులు, వెంగమాంబ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విజయసారథి, కృష్ణ మూర్తి, అర్చకులు గోపాల్‌భట్టార్‌, కృష్ణప్రసాద్‌, కృష్ణరాజ్‌, అనిల్‌, గోకుల్‌, సుందరరాజు, వెంకీ, వరద, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-15T05:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising