ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: కడప ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్‌ పలికిన చిలక పలుకులు..

ABN, First Publish Date - 2022-08-19T18:06:54+05:30

కడప జిల్లా ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తూ సీఎం జగన్‌ పలికిన చిలక పలుకులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా (Kadapa Dist.): 2019 డిసెంబరు 23న కడప జిల్లా ఉక్కు పరిశ్రమ (Steel Industry)కు శంకుస్థాపన చేస్తూ సీఎం జగన్‌ (CM Jagan) పలికిన చిలక పలుకులు.. ‘చిత్తశుద్ధి’కి చిరునామా తానే అనేలా, విశ్వసనీయతపై పేటెంట్‌ తనకు మాత్రమే ఉందనేలా సొంతగడ్డపై చెప్పిన మాటలను విని కడప జిల్లా ప్రజలు మురిసిపోయారు. తమకు ‘ఉక్కు’ కల నెరవేరుతుందని సంబరపడ్డారు. అసలే సొంత జిల్లా, ఆపైన చిత్తశుద్ధి అని కూడా అంటున్నారు కదా... జగన్‌ చెప్పింది చేసి తీరతారని గట్టిగా భావించారు. మరో నాలుగు నెలలు గడిస్తే... ఆయన చెప్పిన మూడేళ్లు ముగుస్తాయి. ‘మాట తప్పని నాయకుడి’ లెక్క ప్రకారం ఈపాటికి ఉక్కు కర్మాగారం పనులు 80 శాతానికిపైగా పూర్తయి ఉండాలి. కానీ... అక్కడ ప్రహరీ మినహా మరేమీ లేదు. ఇక మిగిలింది నాలుగు నెలలు. ఇంత తక్కువకాలంలో నిర్మాణం అంటే అరచేతిలో గ్రాఫిక్స్‌ గీసి ‘సినిమా’ చూపించాల్సిందే!


రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టు కడపలో కేంద్ర ప్రభుత్వమే స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఫ్లాంట్ ఏర్పాటు కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం (TDP Govt.) కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. అయినా కేంద్రం స్పందించకపోవడంతో అప్పటి చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం ఉక్కు సంకల్పం తీసుకుంది. కడప ఉక్కు పరిశ్రమకు సొంత వనరులతో రాష్ట్ర పరిధిలోనే నిర్మాణానికి పూనుకుంది. రాయలసీమ స్టీల్ ఆధారిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి మైలవరం మండలం, ఎం. కంబాలదిన్నె సమీపంలో 3,892 ఎకరాలు కేటాయించింది. రూ. 33వేల కోట్లుతో స్టీల్ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 18 నెలల్లో ఉక్కు ఉత్పత్పి మొదలుపెట్టాలనే లక్ష్యంగా 2018 డిసెంబర్ 27న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు శంకుస్థాపన చేసిన దానికి మంగళం పలికి కొత్తగా స్టీల్ ఫ్లాంట్ నిర్మాణానికి సంకల్పించారు. ఇందులో భాగంగా సరిగ్గా ఏడాది తర్వాత 2019 డిసెంబర్ 23న కడపజిల్లా, జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల సమీపంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ ఫ్లాంట్ నిర్మాణానికి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. రూ. 15వేల కోట్ల వ్యయంతో 30 లక్షల టన్నుల సామర్థ్యం గల స్టీల్ ఫ్లాంట్ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి దక్కుతుందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2022-08-19T18:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising