ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

ABN, First Publish Date - 2022-05-24T06:00:37+05:30

జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జేసీ సీఎం సాయికాంత్‌ వర్మ, డీఆర్వో మాలోల, హౌసింగ్‌ పీడీ కృష్ణయ్యతో కలసి జగనన్న హౌసింగ్‌ కాలనీల నిర్మాణ పనులు, ఓటీఎస్‌ ప్రక్రియ, జగనన్న స్వచ్ఛ సంకల్పం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై మండల, నియోజకవర్గ స్థాయి అధికారులతో నేరుగా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలు, వార్డు పరిధిలో ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌, స్టేజీ కన్వర్షన్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటీఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి 

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

కడప(కలెక్టరేట్‌), మే 23: జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జేసీ సీఎం సాయికాంత్‌ వర్మ,  డీఆర్వో మాలోల, హౌసింగ్‌ పీడీ కృష్ణయ్యతో కలసి జగనన్న హౌసింగ్‌ కాలనీల నిర్మాణ పనులు, ఓటీఎస్‌ ప్రక్రియ, జగనన్న స్వచ్ఛ సంకల్పం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై మండల, నియోజకవర్గ స్థాయి అధికారులతో నేరుగా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలు, వార్డు పరిధిలో ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌, స్టేజీ కన్వర్షన్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హౌసింగ్‌ పథకం ఎంతో ప్రాధాన్యతతో జరుగుతోందన్నారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డోసులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటిలో ఫీవర్‌ సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్‌ లేఅవుట్స్‌, గ్రౌండింగ్‌, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. భూరికార్డుల స్వచ్ఛీకరణలో బాగంగా రీసర్వే, జగనన్న గృహ హక్కు, ఓటీఎస్‌ వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.

అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్‌ వి.విజయరామరాజు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదులను, విజ్ఞప్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగలేదని, కొవిడ్‌ ప్రొటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌ వర్మ, డీఆర్వో మాలోల, డ్వామా పీడీ, డీఆర్డీఏ, మెప్మా పీడీ, స్పెషల్‌ కలెక్టర్‌, అనుడ వీసీ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising