ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్థుల పాలిట వరం జగనన్న విద్యాకానుక

ABN, First Publish Date - 2022-07-06T04:31:39+05:30

విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పేదలకు వరమని మున్సిపల్‌ చైర్మెన్‌ ఫయాజ్‌బాషా అన్నా రు.

విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ చైర్మెన్‌ ఫయాజ్‌బాషా

రాయచోటిటౌన్‌, జూలై5:  విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పేదలకు వరమని మున్సిపల్‌ చైర్మెన్‌ ఫయాజ్‌బాషా అన్నా రు. ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపి ణీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి వై. రాఘవరెడ్డి, ప్రధానోపాధ్యాయడు చంద్రశేఖర్‌, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ఎంఈఓ వెంకటే్‌షనాయక్‌, అర్చన విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మెన్‌, సభ్యులు, బోధన, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

సంబేపల్లెలో.....

జగనన్న విద్యా కానుకను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రాఘవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కిట్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న బైజూస్‌ యాప్‌తో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి, పేరెంట్స్‌ కమిటీ చైర్మెన్‌ బుజ్జిరెడ్డి, కోఆప్షన్‌ మెంబర్‌ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. 

వీరబల్లిలో.....

ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి, వైసీపీ మండల నేత వీరనాగిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. ఎంఈఓ గిరివరదయ్య, ప్రధానోపాధ్యాయురాలు గంగాదేవి పాల్గొన్నారు.

చిన్నమండెంలో....

ఉర్దూ హైస్కూల్‌లో మండల ఉపాధ్యక్షుడు ఎజా్‌సఖాన్‌ అధ్యక్షన విద్యాకానుక పంపిణీ చేశారు. సర్పంచ్‌ నజీర్‌బాషా, స్కూల్‌ కమిటీ చైర్మెన్‌ జాఫర్‌, ప్రధానోపాధ్యాయులు పద్మజ పాల్గొన్నారు. 

పుల్లంపేటలో.... 

ప్రతి ఒక్కరూ చదువు కునేందుకే సీఎం విద్యాకానుక ను ప్రవేశపెట్టారని ఎంపీపీ ముద్దా బాబుల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదర్శ పాఠ శాల, కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు విద్యాకానుకను అందజేశా రు. ఎంఈఓ రంగనాధయ్య, ప్రిన్సిపాల్‌లు లీలాశ్రీహరి, రూత్‌ మేరీ, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

చిట్వేలిలో....

ప్రతి విద్యార్థి భవితకు ముఖ్యమంత్రి జగనన్న బాటలు వేస్తున్నారని చిట్వేలి ఉపసర్పంచ్‌ చౌడవరం ఉమా మమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నా రు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రసా ద్‌ ఆధ్వర్యంలో జగనన్న విద్యాకానుకను పంపిణీ చేశారు. పీడీ డేవిడ్‌ ప్రసాద్‌, ఉపాధ్యాయులు యుగంధర్‌, దుర్గరాజు, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T04:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising