ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న కాలనీల్లో పనులు వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-05-21T05:27:13+05:30

మండల కేంద్రంలో జగనన్న కాలనీ పనులు ఇంతవరకు పను లు ఎందుకు మొదలు పెట్టలేదని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా రెవెన్యూ సి బ్బందిని ప్రశ్నించారు.

జగనన్న కాలనీ వద్ద రోడ్డును పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, మే 20:  మండల కేంద్రంలో జగనన్న కాలనీ పనులు ఇంతవరకు పను లు ఎందుకు మొదలు పెట్టలేదని జాయింట్‌ కలెక్టర్‌  తమీమ్‌ అన్సారియా రెవెన్యూ సి బ్బందిని ప్రశ్నించారు. ఈ స్థలానికి వెళ్లేం దుకు రోడ్డు సక్రమంగా లేదని వారు వివ రించడంతో ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో రోడ్లు వేయించాలని సూచించారు. మండలంలోని జగనన్న కాలనీల్లో పక్కా గృహాలు పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం లక్కిరెడ్డిపల్లెలోని పౌర సరఫరాలశాఖ గోదామును తనిఖీ చేశారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాల డీలర్లు కందిపప్పు, చక్కెరకు డీడీలు చెల్లించాలని కోరారు.  అనంతరం కమ్యూనిటీ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వసతులపై ఆసుపత్రి ఇన్‌చార్జి సతీ్‌షకుమార్‌తో చర్చిం చారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు 24 గంటలు అందుబాటులో డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  పౌరసరఫరాల శాఖ ఎండీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ రవిశంకర్‌రెడ్డి, ఎంపీడీవో పట్నాయక్‌, డాక్టర్లు నీలోఫర్‌బేగం, తేజస్విని, జీవన్‌కుమార్‌, కీర్తిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ శివయ్య, సచివాలయ, ఆసుపత్రి, హౌసింగ్‌ సి బ్బంది పాల్గొన్నారు. 

రామాపురం: మండలంలోని నల్లగుట్టపల్లె, నీలకంట్రావుపేట గ్రామాల్లో జగనన్న నిర్మాణ గృహాలను, భూ ముల రీసర్వేలను జేసీ పరిశీలించారు. మం డలంలోని 4 గ్రామాల్లో  జగనన్న గృహ ని ర్మాణాలు జరగలేదని అధికారులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. భూముల రీసర్వేపై మండల సర్వేయరు రెడ్డిశేఖర్‌బాబును ప్ర శ్నించగా గువ్వలచెరువులో మాత్రమే పూర్త యిందని సమా ధానమిచ్చారు. అనంతరం నీలకంట్రావుపేట సచివాలయాన్ని తనిఖీ చేశారు. త హసీల్దార్‌ ఖాజాబీ, ఇన్‌చార్జి ఎంపీడీవో ఉషారాణి, హౌసింగ్‌ ఏఈ ప్రసాద్‌, ఏడీ జయరాజ్‌, సర్వేయర్‌ రెడ్డిశేఖర్‌బాబు,  కార్యదర్శులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T05:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising