ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలన అంతా జనంపై ‘బాదుడే బాదుడు’

ABN, First Publish Date - 2022-09-25T05:10:09+05:30

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన అంతా జనంపై బాదుడే బాదుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ ధ్వజమెత్తారు.

బోడెద్దులపల్లెలో బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

సీకేదిన్నె, సెప్టెంబరు 24: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన అంతా జనంపై బాదుడే బాదుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ ధ్వజమెత్తారు. శనివారం చింతకొమ్మదిన్నె మం డలం ఇప్పెంట పంచాయతీలోని బోడి ఎద్దులపల్లె గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పద వి చేపట్టినప్పటి నుంచి అధికంగా పన్నులు, ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపుని చ్చారు. నిత్యావసర సరుకుల నుంచి ప్రతి వస్తువు విపరీతంగా పెరగడంతో మహిళలు వంటిట్లోకి వెళ్లాలంటేనే గ్యాస్‌, నూనెలు కరెంట్‌ షాక్‌ కొట్టినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఏ ప్రభుత్వంలో మేలు జరిగిందో తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల టీడీపీ ఇన్‌ఛార్జి పి.వి.కృష్ణారెడ్డి, గంథం మోహన్‌బాబు, డి.వి.సుబ్బారెడ్డి, జబివుల్లా, రెడ్డిబాష, సుబ్బనరసయ్య, నారాయణ, ఖాజాపీర్‌, సుబ్బరాయుడు, భాస్కర్‌రెడ్డి, నరసింహులు యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T05:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising