ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనంతా బాదుడే బాదుడు!

ABN, First Publish Date - 2022-09-26T04:40:33+05:30

జగన్‌ పాలనంతా బాదుడే బాదుడు అని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్జి కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు.

బాదుడే బాదుడు పై ప్రజలకు వివరిస్తున్న కస్తూరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, సెప్టెంబరు 25: జగన్‌ పాలనంతా బాదుడే బాదుడు అని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్జి కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు. ఆదివారం రైల్వేకోడూరు పట్టణంలోని నరసరాంపేటలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల టీడీపీ పాలనలో విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యుత్‌ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దారారన్నారు. వైఎస్‌ జగన్‌ మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రూ. 16.611 కోట్ల భారం వేశారన్నారు. విద్యుత్‌ సంస్థలను తనఖా పెట్టి తెచ్చిన రూ. 26.261 కోట్లను దారి మళ్లించారన్నారు. పోలవరం జల విద్యుత్‌ కేంద్రాన్ని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, సోలార్‌, విండ్‌ విద్యుత్‌ ఒప్పందాల రద్దుతో విద్యుత్‌ కోతలు అనివార్యమయ్యాయన్నారు. కరోనా అనంతరం ప్రతి ఒక్కరూ ఆర్ధికంగా చితికిపోయారన్నారు. ప్రజల గురించి ఆలోచించే ఏ ప్రభుత్వమైనా పన్నుల భారం తగ్గించి దన్నుగా నిలువాల్సిన పరిస్థితిలో జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏ వర్గాన్ని వదలకుండా పన్నులు విధించినట్లు ఆరోపించారు. చెత్త, మరుగుదొడ్డి, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, నీటి తీరువా, వృత్తి పన్ను, నాలా, గ్రీన్‌ట్యాక్సు, పోల్‌ట్యాక్సు వంటి పన్నులు విధించి ప్రజలను మరింత అప్పులపాలు చేశారన్నారు. జే బ్రాండ్స్‌ మద్యంతో ఆరోగ్యానికి హాని కల్గిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Updated Date - 2022-09-26T04:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising