‘జగన్ సాధించింది బటన్ నొక్కడం.. డప్పు కొట్టుకోవడమే’
ABN, First Publish Date - 2022-12-07T23:24:28+05:30
బటన్ నొక్కడం... డప్పు కొట్టుకోవడమే తప్ప జగన్‌మోహన్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతు గుంట రమేష్‌నాయుడు ఎద్దేవా చేశా రు.
రాజంపేట, డిసెంబరు7 : బటన్ నొక్కడం... డప్పు కొట్టుకోవడమే తప్ప జగన్‌మోహన్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతు గుంట రమేష్‌నాయుడు ఎద్దేవా చేశా రు. రాజంపేట బీజేపీ కార్యాలయం లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని పట్టించుకోకుండా సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతూ కాలం గడుపుతుండడంతో రాష్ట్రం దివాళా తీస్తోందన్నారు. పారిశ్రా మికరంగ అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాబోవు ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సి ద్ధంగా ఉన్నారన్నారు. రైతులను నట్టే ట ముంచిన ఘనత జగన్‌కే దక్కు తుందన్నారు.
డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు సబ్సిడీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. వికేంద్రీక రణ పేరుతో రాష్ట్రాన్ని మూడుముక్క లు చేయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు ఆదినారాయణ, సుభ ద్ర, నాగరాజు, శ్రీనివాసులు, పురుషోత్తం, అభిరామ్, నగేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:24:31+05:30 IST