ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులివెందుల అభివృద్ధికే సీఎం జగన్‌ పరిమితమా!

ABN, First Publish Date - 2022-12-30T22:57:01+05:30

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా కాకుండా కేవలం పులివెందులకే పరిమితమై అభివృద్ధి పనులు ఆ నియో జకవర్గానికే చేస్తున్నారని, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికో.. పులివెందులకో అర్థం కావడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు

రాజంపేట, డిసెంబరు 30: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా కాకుండా కేవలం పులివెందులకే పరిమితమై అభివృద్ధి పనులు ఆ నియో జకవర్గానికే చేస్తున్నారని, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికో.. పులివెందులకో అర్థం కావడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విమర్శించారు. రాజంపేటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని నిలదీసి రాజంపేట పార్లమెంట్‌ అభివృద్ధికి నిధులు తెచ్చుకోవడంలో దమ్ము, ధైర్యం లేని ఎంపీ మిథున్‌ రెడ్డిని గెలిపించుకున్న పాపానికి ప్రజలు ప్రజలు ప్రశ్చాత్తాపడుతున్నారన్నారు. అన్న మయ్య ప్రాజెక్టు తెగిపోయి 13నెలలు దాటుతున్నా కనీసం ప్రాజెక్టుకు తగిన న్యాయం చేయలేకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాజంపేట వాసులంతా గల్ఫ్‌దేశాలకు వలస పోవాల్సి వస్తుందన్నారు. రాజంపేటకు చెందిన అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు రాజంపేట పార్లమెంట్‌కు నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయాలన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నేతలను ఇంటికి పంపడం తధ్యమన్నారు. జనవరి 9న కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రాను న్నా రని.. దీంతో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్నారు. మద్యం, ఇసుక దందాలపై వైసీపీ నేతలు పెడుతున్న దృష్టి మౌలిక సదుపాయాల కల్పనలో లేకపో వడం అవమానకరమన్నారు. దశల వారీగా మద్యపాన నిషేదం అని చెప్పి దశల వారీగా అమ్మకాలు పెంచుతున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-12-30T22:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising