ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా టమోటా సాగు

ABN, First Publish Date - 2022-06-27T05:39:10+05:30

మండల వ్యాప్తంగా రైతులు జోరుగా టమోటాను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు ఉండడంతో సాగు వైపు మక్కువ చూపుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి ప్రతియేటా ధరలు లేక నష్టపోయిన రైతులకు ఈ ఏడాది నిలకడ ధరలతో కొంత ఆదాయాన్ని తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. తీవ్రంగా నష్టపోయిన రైతులు పంట సాగుకు దూరంగా ఉండటంతో తిరిగి రైతుల్లో ఆశలు చిగురించాయి.

మల్చింగ్‌ విధానం ద్వారా సాగు చేస్తున్న టమోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిలకడ ధరతో లాభాల్లో రైతులు

అన్నదాతల్లో చిగురించిన ఆశలు 

సంబేపల్లె, జూన్‌ 26: మండల వ్యాప్తంగా రైతులు జోరుగా టమోటాను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు ఉండడంతో సాగు వైపు మక్కువ చూపుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి ప్రతియేటా ధరలు లేక నష్టపోయిన రైతులకు ఈ ఏడాది నిలకడ ధరలతో కొంత ఆదాయాన్ని తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. తీవ్రంగా నష్టపోయిన రైతులు పంట సాగుకు దూరంగా ఉండటంతో తిరిగి రైతుల్లో ఆశలు చిగురించాయి. మండల వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 150 ఎకరాల్లో సాగు చేయగా, జూలై నెలల్లో రైతులు అధికశాతంలో టమోటా సాగు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది 2500 నుంచి 3 వేల ఎకరాల వరకు సాగు చేపట్టనున్నారు. నారు నర్సరీల్లో టమోటా మొక్కలకు డిమాండ్‌ ఏర్పడింది. ఒకప్పుడు తీగజాతి రకాలైన టమోటా పిలకలు 60 పైసల నుంచి 70 పైసలు ఉండేది. ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో ఒక రూపాయి నుంచి 1:5 పైసలు పెరిగింది. జిల్లాలో సంబేపల్లె, చిన్నమండెం మండలాల్లో టమోటా సాగు ప్రతియేటా రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. 


కలుపు నివారణకు మల్చింగ్‌ విధానం

టమోటా సాగులో రైతులు కలుపు నివారణ కోసం మల్చింగ్‌ విధానాన్ని చేపడుతున్నారు. ఈ విధానం ద్వారా కలుపు, గడ్డి నియంత్రించడమే కాకుండా ఎక్కువ రోజులు నీటి తేమ పట్టుకొని ఉంటుందన్నారు. తక్కువ నీరు ఉన్న ప్రదేశాల్లో ఈ విధానం ద్వారా సాగు చేస్తే ఉన్న నీటితో తేమ శాతాన్ని పట్టుకొని మొక్క ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. పంట సాగు, కలుపు గడ్డి అధికమై రైతులకు అదనపు ఖర్చులు పెరుగుతుండడంతో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతున్నట్లు తెలియజేశారు. ఎక్కువ మంది రైతులు ఈ విధానాన్ని అవలంభించడం విశేషం. 

Updated Date - 2022-06-27T05:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising