ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట పరిశీలన

ABN, First Publish Date - 2022-05-22T04:47:22+05:30

బీకోడూరు మండలంలో జిల్లా వనరుల కేంద్రం డాక్టర్‌ పద్మోదయ, కో-ఆర్డినేటర్‌ ఏరువాక కేంద్రం నాగరాజు, సహాయ వ్యవసాయ సంచాలకులు రైతు శిక్షణ కేంద్రం కడప వారు శనివారం ఏవో సురే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పంటలను పరిశీలించారు.

వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీకోడూరు, మే 21 : బీకోడూరు మండలంలో జిల్లా వనరుల కేంద్రం డాక్టర్‌ పద్మోదయ, కో-ఆర్డినేటర్‌ ఏరువాక కేంద్రం నాగరాజు, సహాయ వ్యవసాయ సంచాలకులు రైతు శిక్షణ కేంద్రం కడప వారు శనివారం  ఏవో సురే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పంటలను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను మరాఠిపల్లె, గుంతపల్లె, మున్నెళ్లి గ్రామాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ  ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో నీరు నిలబడడం వలన వేరు వ్యవస్థకు గాలి చొరబడడం లేదని వర్షపు నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపే విధంగా రైతులు చేసుకోవాలని అవగాహన  కల్పించారు. అలాగే ఈ సీజన్‌లో పత్తికి రసం పీల్చు పురుగు, గులాబీరంగు పురుగు, కుళ్లు రోగం, పోషకలోపాలు తక్కువ స్థాయి నుంచి మధ్యస్థ స్థాయిలో ఉందని వాటి నివారణకు మెగ్నీషయం సల్ఫేట్‌ ఎకరాకు 300 లీటర్లు పిచికారీ చేసుకోవాలన్నారు. అలాగే సస్యరక్షణకు డైసెంట్‌ డియూరాన్‌, హెక్సాకొనాజోల్‌ ఎకరాకు 300 లీటర్లు   పిచికారీ చే సుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల సహాయ వ్యవసాయ సంచాలకుడు సుబ్బారావు, ఆర్బీకే సిబ్బంది రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T04:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising