బోధనలో నూతనత్వం అవసరం
ABN, First Publish Date - 2022-08-05T04:54:42+05:30
బోధనా విధా నంలో నూతనత్వం అవసరమని అన్నమ య్య జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి అ న్నారు.
రాయచోటిటౌన్, ఆగస్టు 4: బోధనా విధా నంలో నూతనత్వం అవసరమని అన్నమ య్య జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి అ న్నారు. సాల్ట్ (సపోర్టివ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్) కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో తరగతి గది బోధన- పర్యవేక్షణ అనే అంశంపై రాయచోటి పట్ట ణంలోని డైట్ విద్యా కేంద్రంలో ప్రధానోపాఽ ద్యాయులు, ఉపాధ్యాయులకు 9 రోజుల శిక్ష ణ కార్యక్రమం గురువారం ప్రారంభమైం ది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేం దుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. డైట్ లెక్చరర్స్ శివ భాస్కర్, చాన్‌బాషా, నాగరాజు, వైసీ రెడ్డెప్ప రెడ్డి, రీసోర్స్ పర్సన్స్ అబ్బవరం హరిబాబు, మహేశ్వరయ్య, రామాంజులు, నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T04:54:42+05:30 IST