అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర పిత : తులసిరెడ్డి
ABN, First Publish Date - 2022-12-15T23:56:10+05:30
తెలుగు భాష మాట్లేడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు అమరజీవి అని, త్యాగశీలి అని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు.
వేంపల్లె, డిసెంబరు 15: తెలుగు భాష మాట్లేడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు అమరజీవి అని, త్యాగశీలి అని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, అసలు సిసలు గాంధేయవాది అయిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి, ఉక్కుమనిషి సర్దార్ పటేల్ 72వ వర్ధంతిని వేంపల్లెలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అసలైన గాంధేయవాది అని, హరిజనుల ఆలయ ప్రవేశం కోసం, మద్యపాన నిషేధం కోసం జైళ్ల సంస్కరణల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా దేశంలోకి తొలి భాషా ప్రయుక్తంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇటువంటి రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని జగన ప్రభుత్వం రద్దు చేయడం విడ్డూరమన్నారు. చెన్నైలోని పొట్టిశ్రీరాములు స్మారక భవనం నిర్వహణకు గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం గర్హనీయమన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గొప్ప పరిపాలన దక్షుడు, కార్యదక్షుడని తులసిరెడ్డి కీర్తించారు. హైదరాబాద్, జనాఘడ్ సహా 565 స్వదేశీ సంస్థాలను భారతలో విలీనం చేసి విశాల భారతావని నిరర్మాణానికి కృషిచేసిన సమైక్యతవాది పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, బాబు, వేంపల్లె మండల శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉత్తన్న, అమర్, బద్రి, రాఘవయ్య, వెంకటేశ, సత్తార్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:56:25+05:30 IST