ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార లేఅవుట్లను ఉపేక్షించం

ABN, First Publish Date - 2022-05-25T04:56:51+05:30

అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని అలాంటి వాటిని వెంటనే ఆపాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదేశించారు.

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ సరఫరా ఆపేయండి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి (కలెక్టరేట్‌), మే 24: అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని అలాంటి వాటిని వెంటనే ఆపాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదన్నారు. ఎక్కడైనా అనధికార లేఅవుట్లు వేసినట్లయితే అలాంటి వాటికి విద్యుత్‌ సరఫరా ఇవ్వకూడదని ఏపీఎ్‌సపీడీసీఎల్‌ అధికారులను ఆదేశించారు. ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండా భవన నిర్మాణాలు చేయరాదని, అలాగే అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వేయరాదన్నారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ లేకుండా లేఅవుట్‌లు చేపట్టరాదని, జిల్లాలోని తహసీల్దార్‌లందరూ అనధికార లేఅవుట్‌లపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. రాయచోటి పట్టణంలో ఎక్కువగా అనధికార లేఅవుట్‌లు వేస్తున్నారని, వీటిపై రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. రాయచోటి పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో రోజు రోజుకు పురోగతి కనిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాయచోటి పట్టణానికి మంజూరైన డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలోని వాల్మీకివీధి, కొత్తపల్లె, కె.రామాపురం, తిరుపతినాయుడు కాలనీ సమీపంలో నిర్మించే ఈ హెల్త్‌ క్లీనిక్‌లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అన్నమయ్య పట్టణ అభివృద్ధి సంస్థ (అడా) వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రీలక్ష్మి, రాయచోటి తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ సతీష్‌, మున్సిపల్‌ డీఈ సుధాకర్‌నాయక్‌, మున్సిపల్‌ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T04:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising