పనిచేయమంటే.. గొడవలు పెట్టుకుంటారా
ABN, First Publish Date - 2022-12-16T23:25:52+05:30
అంగన్వాడీ సెంటర్లలో బాధ్యతగా పనిచేయాలంటే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుం టూ గొడవలు పెట్టుకుంటారా అని ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి అంగన్వాడీ కార్యకర్తలను హెచ్చరించారు.
బతిమలాడైనా పిల్లలను సెంటరుకు పిలిపించుకోవాలి
సక్రమంగా పనిచేయకపోతే బదిలీ తప్పదు : పీడీ
చెన్నూరు, డిసెంబరు 16: అంగన్వాడీ సెంటర్లలో బాధ్యతగా పనిచేయాలంటే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుం టూ గొడవలు పెట్టుకుంటారా అని ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి అంగన్వాడీ కార్యకర్తలను హెచ్చరించారు. సెంటర్ల లో చిన్నారుల సంఖ్య 15 నుంచి 20 వరకు ఉండాలి. సంఖ్య తగ్గితే వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి బతిమలాడైనా సరే ఆరేళ్లలోపు పిల్లలను సెంటరుకు పిలిపించుకుని సక్రమంగా విద్యాబుద్దులు నేర్పించాలని సూచించారు. గొడవలు పెట్టుకుం టే సహించేది లేదు. సంఖ్య తగ్గిన సెంటర్లలో ఉన్న కార్యకర్తలను మరోచోటకు బదిలీ చేయక తప్పదన్నారు. చెన్నూరులోని 1, 4, 6వ అంగన్వా డీ కేంద్రాలను ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టరు శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో 1వ సెంటరులో 12 మంది, నాలుగో సెంటరులో 8, 6వ సెంటరు లో ఇద్దరు పిల్లలు ఉండడంపై ఆగ్రహించారు.
ఇంత దారుణంగా సెంటర్లు ఉంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు అవసరమా అని ప్రశ్నించారు. పిల్లలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు, పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అయినా చాలా చోట్ల పిల్లలు లేకపోవడానికి అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు విబేధాలు ఉండడమే కారణంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితులపై తాను కలెక్టరుకు నివేదిక ఇస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త, ఆయాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే ఆ సెంటరు బాగా నడుస్తుందన్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల అంగన్వాడీ కేం ద్రాల పనితీరుపై అక్కడి, ఆయా, కార్యకర్తల తీ రుపై తల్లిదండ్రుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితి ఉండడం చాలా దారుణమన్నా రు. ప్రతి వెయ్యి మంది జనాభా ఉన్నచోట ఒక అంగన్వాడీ సెంటరు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదన్నా రు.
2389 అంగన్వాడీ కేంద్రాల్లో 96 మంది సూపర్‌వైజర్లు ఉండాల్సి ఉండ గా 53 మంది మాత్రమే ఉన్నారన్నా రు. పర్యవేక్షణ లోపం ఎక్కువగా ఉ న్నట్లుందని సూపర్‌వైజరు, ఐసీడీఎస్ సీడీపీఓలు సరిగా సెంటర్లను తనిఖీ చేయనట్లుగా అర్థమౌతోందన్నారు. ఈ పరిస్థితిపై కలెక్టరుకు నివేదిక ఇచ్చి అంగన్వాడీ కార్యకర్తలను అదే మండలంలో మరోచోటకు మార్చడమో వారి సేవలు వేరొక దానికి వాడుకోవడ మో జరుగుతుందన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్నారు. ఈ గొడవలు సచివాలయ మహిళా పోలీసుల వరకు వెళ్లడం వారు కౌన్సిలింగ్ ఇచ్చినా ఉపయోగంలేకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఈ కేంద్రాల్లో సక్రమంగా ఉండకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. కాగా ఈ అంగన్వాడీ కేంద్రాలపై ఎంపీపీ చీర్ల సురే్‌షయాదవ్, కో ఆప్షన్ మెంబరు వారిష్, కమలాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి సైతం అంగన్వాడీ సెంటర్ల పనితీరు సక్రమంగా లేదని పీడీకి ఫిర్యా దు చేశారని తెలుస్తోంది. అనంతరం పీడీ రికార్డులు, పౌష్టికాహారం పరిశీలించారు.
Updated Date - 2022-12-16T23:25:54+05:30 IST