ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక పరిస్థితి బాగుంటే బకాయిలు ఎందుకు చెల్లించరు?

ABN, First Publish Date - 2022-09-18T05:09:45+05:30

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ప్రకటించిన ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఎఫ్‌, పార్ట్‌ ఫైనల్‌ పేమెంట్స్‌, లోన్లు, ఈఎల్‌ఐ వంటివి ఎందుకు చెల్లించడం లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రసంగిస్తున్న లక్ష్మీరాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 17: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ప్రకటించిన ముఖ్యమంత్రి  ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఎఫ్‌, పార్ట్‌ ఫైనల్‌ పేమెంట్స్‌, లోన్లు, ఈఎల్‌ఐ వంటివి ఎందుకు చెల్లించడం లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కడప నగరం యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో శనివారం ఆ యూనియన్‌ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ త్వరగా చెల్లించి మాట నిలబెట్టుకోవాలని కోరారు.  రెండు డీఏ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైద్యసేవల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యకమ్రంలో జిల్లా ప్రధాన కార్యద ర్శి పాలెం మహే్‌షబాబు, ట్రెజరర్‌ నరసింహరావు, జిల్లా కార్యదర్శులు చంద్రశేఖర్‌, దావుద్దీన్‌, కిరణ్‌కుమార్‌, కరీముల్లా, జావీదు, వీరనారాయణ పాల్గొన్నారు.

చెన్నూరు:  చెన్నూరులో  మాట్లాడుతూ  హామీని నిలబెట్టుకోవాలని కోరితే అరెస్టులు చేయడం దారుణమన్నారు.  మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే ప్రకటించే ముఖ్యమంత్రి సీపీఎస్‌ విషయంలో చేసిందేమిటని ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దు చేస్తే కేంద్ర  ప్రభుత్వం తమ నట్లు బిగిస్తుందని మంత్రులు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. మూడేళ్ళలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-18T05:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising