నోటీసులిస్తే దాడి చేశారు
ABN, First Publish Date - 2022-10-18T04:33:05+05:30
అనధికార లేఅవుట్‌లపై నోటీసులిస్తే విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మహిత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు సర్పంచ్ ఫిర్యాదు
వాల్మీకిపురం అక్టోబరు 17: అనధికార లేఅవుట్‌లపై నోటీసులిస్తే విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మహిత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ లేఔట్లకు సంబంధించి పంచాయతీ అప్రూవల్, అనుమతులు లేకపోవడంతో వాటికి గతనెల 27వ తేదీ నోటీసులు జారీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తాను పంచాయతీ కార్యాలయంలో ఉండగా భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, యుగంధర్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు తనపై దాడికి పాల్పడటమే కాకుండా తన భర్త శేషాద్రిరెడ్డిని దుర్భాషలాడుతూ కొట్టి గాయపరిచారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎస్పీ, జిల్లా పంచాయతీ అధికారి, వాల్మీకిపురం సీఐ తదితరులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Updated Date - 2022-10-18T04:33:05+05:30 IST