ఆశాలను తొలగిస్తే ప్రభుత్వం పతనమే
ABN, First Publish Date - 2022-12-16T23:54:11+05:30
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఆశా కార్యకర్తలను కుదించాలని, తొలగించాలని చేస్తున్న ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చే శారు.
- ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటి వేణుగోపాల్
కడప (సెవెన్‌రోడ్స్), డిసెంబరు 16 : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఆశా కార్యకర్తలను కుదించాలని, తొలగించాలని చేస్తున్న ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చే శారు. గురువారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా గౌరవాధ్యక్షుడు గుంటి వేణుగోపాల్‌తో పాటు జిల్లా అధ్యక్షుడు కె.కల్పన, ప్రధాన కార్యదర్శి బి.శాంతమ్మ విలేక రులతో మాట్లాడారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా 2006లో ఎలాంటి వయో పరిమితి, విద్యార్హతలు లేకుండా స్వచ్ఛంద సేవలకులుగా ఆశా కార్యకర్తలను నియమించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాల భారాన్ని తగ్గించుకునేందుకు అర్బన్ ప్రాంతాల్లో 2500, గ్రామీణ ప్రాంతాల్లో 1000 మంది ఆశాలను నియమించుకోవాలని వారం రోజుల క్రితం సర్కులర్ జారీ చేసిందన్నారు. దీనివల్ల ఆశా కార్యకర్తలు తమ ఉద్యోగాలను కో ల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆశాలను కుదించే యత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశాలకు రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పలు సమస్యలతో ఆశాలు ఇబ్బందులు పడుతున్నారని వీటన్నింటినీ ప్రభుత్వం తీర్చాలని డి మాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు శివ, రంగమ్మ, చిన్న, అనసూయ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:54:15+05:30 IST