ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శం.. వివేకానందుని జీవితం

ABN, First Publish Date - 2022-01-13T05:36:15+05:30

యువత స్వా మి వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎన్‌ఎ్‌సఏపీవో డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

వివేకానందుని చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా  స్వామి వివేకానంద జయంతి వేడుకలు

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 12: యువత స్వా మి వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎన్‌ఎ్‌సఏపీవో డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భం గా స్టెప్‌ కార్యాలయంలో బుధవారం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్వా మి వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ దేశ యువత, విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశం కోసం పాటుపడాలన్నారు. యువకుల్లో ఉత్తేజాన్ని నింపి వారికి ఎల్లప్పుడు ఆదర్శంగా నిలిచిన స్వామి వివేకానందుని జీవితం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టెప్‌, డీఎస్‌ఏ సిబ్బంది పాల్గొన్నారు.


ఏబీవీపీ ఆధ్వర్యంలో..: బుధవారం స్థానిక వినాయకనగర్‌లో స్వామి వివేకానంద విగ్రహానికి ఏబీవీపీ కోకన్వీనర్‌ కోడూరు మల్లికార్జున ఆధ్వ ర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య లు వస్తే రానీ, సవాళ్లు ఎదురైతే ఎదురవ్వని, ఓ టమి తలుపు తడితే తట్టనీ, నిలుద్దాం, పోరాడు దాం... గెలుద్దాం.. అని విద్యార్థుల గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నా రు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నిఖిల్‌, రాజు, నాగేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు. 


రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో..

కడప (నాగరాజుపేట), జనవరి 12: స్వామి  వివేకానంద జయంతి సందర్భంగా బుధవారం స్థానిక రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ పిచ్చయ్య చౌదరి, కార్యదర్శి మునిరాజు, డాక్టర్‌ మహబూబ్‌ బాషా, సొసైటీ సభ్యులు జానుమద్ది విజయభాస్కర్‌, వేణుగోపాల్‌, చంద్రశేఖరయ్య, శివశంకర్‌, బ్లడ్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 


టీడీపీ ఆధ్వర్యంలో..

కడప, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): యువత స్వామి వివేకానందను స్పూర్తిగా తీసుకొని ఆయన ఆలోచనలతో ముందుకు సాగాలని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం తన కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత, జయకుమార్‌, కోదండర  తదితరులు  పాల్గొన్నారు. 


రామకృష్ణ మిషన్‌లో..

సీకేదిన్నె, జనవరి 12: దేశానికి యువశక్తి ఎంతో అవసరమని క్రీడా పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ రామచంద్రారెడ్డి, రామకృష్ణ మిషన్‌ కార్యదర్శి రవి, శికాంతానందజీ మహరాజ్‌ స్వామి తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని రామకృష్ణ మిషన్‌లో ఘనంగా నిర్వహించారు. అలాగే కేఎ్‌సఆర్‌ఎం కళాశాలలో యువజనోత్సవాలను ప్రిన్సిపాల్‌ వీఎ్‌సఎస్‌ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 


విశ్వశాంతి చాటిన మహనీయుడు 

కమలాపురం రూరల్‌, జనవరి 12: భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, కమలాపురం ఆర్‌ఎ్‌సఎస్‌ సంఘ్‌ శ్రీనివాసులు, నాగసుబ్బరాయుడు తెలిపారు. బుధవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు రెడ్డిసురేష్‌, నరసింహ, రాధాకృష్ణ, మహేశ్వర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, యల్లారెడ్డి, రాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-13T05:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising