ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షానికి రైతులకు భారీ నష్టం

ABN, First Publish Date - 2022-05-18T05:01:37+05:30

జమ్మలమడుగులో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ధర్మాపురంలోవరి పంటను పరిశీలిస్తున్న ఏవో చంద్రశేఖర్‌రెడ్డి, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, మే 17: జమ్మలమడుగులో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన పంట నేలవాలింది. మండలంలోని ధర్మాపురం, గొరిగెనూరు, పెద్దదండ్లూరు, సిరిగేపల్లె, అంబవరం, గూడెం చెరువు, పి.బొమ్మేపల్లె, తదితర గ్రామాల్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం జమ్మలమడుగు ఏవో చంద్రశేఖర్‌రెడ్డి, రైతులు ధర్మాపురం గ్రామంలో నష్టపోయిన వరి పంటను పరిశీలించారు. గొరిగెనూరు గ్రామంలో ఇంతవరకు ఒక ఎకరా పంట కూడా కోత కోయలేదని పూర్తిగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే ధర్మాపురంలో 300 ఎకరాలకుపైగా పంట వర్షానికి నేలవాలింది.  ఈ సందర్భంగా ఏవో చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులతో ప్రాథమిక అంచనా వేసి జిల్లా అధికారులకు రిపోర్టు పంపినట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2022-05-18T05:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising