ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యం వికటించి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2022-01-17T05:20:59+05:30

నాలుగేళ్ల పాపకు జ్వరం వస్తుండడంతో కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్‌ సెలవులో ఉన్నప్పటికీ ఆస్పత్రి సిబ్బందే పాపను అడ్మిట్‌ చేసుకుని సిబ్బంది వైద్యం చేయడంతో చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. దీంతో వారు ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. పెండ్లిమర్రి మండలం నాగసానిపల్లెకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్‌ లేకుండానే సిబ్బంది వైద్యం చేశారని తల్లిదండ్రుల ఆరోపణ

ఆస్పత్రిలో సామాగ్రి ధ్వంసం 

పోలీసులకు బాధితుల ఫిర్యాదు 

కడప(క్రైం), జనవరి 16 : నాలుగేళ్ల పాపకు జ్వరం వస్తుండడంతో కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్‌ సెలవులో ఉన్నప్పటికీ ఆస్పత్రి సిబ్బందే పాపను అడ్మిట్‌ చేసుకుని సిబ్బంది వైద్యం చేయడంతో చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. దీంతో వారు ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. పెండ్లిమర్రి మండలం నాగసానిపల్లెకు చెందిన తాళ్లపల్లి సుబ్బారెడ్డి, రాజేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె తాళ్లపల్లె పల్లవి (4) జ్వరం వస్తుండడంతో ఆదివారం ఉదయం కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్‌ లేకపోయినప్పటికీ ఆస్పత్రి సిబ్బందే పాపను అడ్మిట్‌ చేసుకుని వైద్య పరీక్షలు మొదలు పెట్టారని పాప తల్లిదండ్రులు తెలిపారు. మధ్యాహ్నం వరకు బాగున్న పాప తరువాత మృతి చెందడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, జ్వరానికి సంబంధించిన వైద్యం సరిగా చేయకపోవడంతో వైద్యం వికటించి పాప చనిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వారి బంధువులు మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆందోళనకు దిగి అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి ఆస్పత్రి ఎదుట బైటాయించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అనడంతో ఈ మేరకు ఫిర్యాదు ఇస్తే ఆస్పత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-17T05:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising