ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా హనుమత్‌జయంతి శోభాయాత్ర

ABN, First Publish Date - 2022-05-25T05:30:00+05:30

గండి క్షేత్రంలో హనుమజ్జయంతి సందర్భంగా శోభాయాత్ర వైభవంగా ప్రారంభమై మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది.

గండిలో శోభాయాత్రను ప్రారంభిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, మే 25: గండి క్షేత్రంలో హనుమజ్జయంతి సందర్భంగా శోభాయాత్ర వైభవంగా ప్రారంభమై మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఉదయం 7గంటలకు గండి క్షేత్రంలో శోభా యాత్రను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, రాచరాయ, వేంకటేశ్వరస్వామి ఆలయాల చైర్మన్‌ తంగేడుపల్లె రామిరెడ్డి, మాజీ చైర్మన్లు లాయర్‌ రామాంజులరెడ్డి, చక్రపాణిరెడ్డి, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, ఈఓ ముకుందరెడ్డి బైకు ర్యాలీని ప్రారంభించారు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రకు గ్రామగ్రామాన బ్రహ్మరథం పట్టారు. దాదాపు 420 బైకులు, 40 సుమోలు, 20కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ శోభాయాత్ర గండి నుంచి అద్దాలమర్రి, చెరువుకాంపల్లె, కుమార్లకాల్వ, సిద్దారెడ్డిగారిపల్లె, తక్కళ్లపల్లె, రాచుపల్లె, కుప్పం, బురుజుపల్లె, మహదేవపల్లె, గంగారపువాండ్లపల్లె, సురభి రెడ్డివారిపల్లె, బాలతిమ్మయ్యగారిపల్లె, నాగులగుట్టపల్లె, గడ్డంవారిపల్లె, తొట్టికాడపల్లె, చిలేకాంపల్లె, చక్రాయపేట గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు.  హిందూ ధర్మం ఉట్టిపడేలా జైశ్రీరాం అంటూ కాషాయం జెండాలు చేతబట్టి గ్రామాగ్రా మాన హారతులు అందుకుంటూ ర్యాలీ నిర్వహించారు. చిలే కాంపల్లెలో బైకు ర్యాలీకి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి టెంకాయ కొట్టి ఆంజనేయస్వామికి మొక్కుకున్నారు. వచ్చిన భక్తాదులకు చెరువుకాంపల్లె చంద్ర అల్పాహారం, బాలతిమ్మయ్యగారిపల్లెలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  

Updated Date - 2022-05-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising