ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిఘా నీడలో గురువులు

ABN, First Publish Date - 2022-08-31T06:07:22+05:30

సీపీఎస్‌ రద్దులో భాగంగా సీఎం నివాసం ముట్టడి కార్య క్ర మానికి బయలుదేరి వెళ్లే ఉపాధ్యాయ సంఘాల నాయకులను ముందుగా గుర్తించి మూడురోజులుగా గృహనిర్బంధం చేసిన విషయం విధితమే. అలాగే మరికొందరికి నోటీ సులు జారీ చేసిన పోలీసులు సివిల్‌ దుస్తుల్లో తిరుగుతూ గురువుల కదలికలపై నిఘా ఉంచారు.

ఎస్టీయూ నాయకులు సుబ్బారెడ్డిని గృహనిర్బంధం చేసిన వైనం(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయటకు వెళ్లనీయకుండా పోలీసుల పహారా

ఉపాధ్యాయ సంఘ నేతల ఆవేదన


మదనపల్లె క్రైం, ఆగస్టు 30: సీపీఎస్‌ రద్దులో భాగంగా సీఎం నివాసం ముట్టడి కార్య క్ర మానికి బయలుదేరి వెళ్లే ఉపాధ్యాయ సంఘాల నాయకులను ముందుగా గుర్తించి మూడురోజులుగా గృహనిర్బంధం చేసిన విషయం విధితమే. అలాగే మరికొందరికి నోటీ సులు జారీ చేసిన పోలీసులు సివిల్‌ దుస్తుల్లో తిరుగుతూ గురువుల కదలికలపై నిఘా ఉంచారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండు, సీటీఎం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేస్తూ, పికెట్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోకల మధుసూదన్‌, డివిజన్‌ కన్వీనర్‌ నరసింహులు, రాష్ట్ర కౌన్సిలర్‌ సుబ్బారెడ్డి, యల్లారెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ పురం వెంకటరమణ, రవిప్రకాష్‌, సీపీఎస్‌ ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాసులుతో పాటు మరికొందరు గృహనిర్బంధంలో ఉన్నారు. వీరు   విధులకు వెళ్లినా.. పాఠశాల వద్ద పోలీసులు కాపలా ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్కూల్‌ వద్దే ఉండి రాత్రంతా ఇళ్ల వద్ద కాపలా కాస్తున్నారు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలన్నా... వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారు. ఇక ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. పిలిచిన వెంటనే రాకుంటే అరెస్టు చేసి తీసుకొస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. దొంగతనం లేదా ఏదైనా నేరం చేసిన వాళ్లను మాట్లాడినట్టు మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పూచీకత్తుతో ఇళ్లకు పంపుతున్నారని... ఇళ్లకు వచ్చే సమయంలో వెంట ఒకరిద్దరు కానిస్టేబుళ్లు వస్తున్నారన్నారు. ఇది చూసిన వారంతా తామేదో నేరం చేశామనే భావనలో ఉన్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండుగ సమ యంలోనూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం లేకుండా చేశారని వాపో యారు. సీఎం నివాసం ముట్టడి కార్యక్రమం వాయిదా పడిందని చెప్పినా.. పోలీసులు వినకుండా ఇళ్లవద్దే ఉండి ఇబ్బంది పెడుతున్నారన్నారు. కనీసం సమీపంలోని దుకాణం వద్దకు కూడా వెళ్లనీయకుండా అడ్డుపడుతూ ఆంక్షలు విధించారని మండిపడ్డారు. తమ కోసం, తమ కుటుంబం కోసం పోరాటం సాగించలేదని... ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యమం చేస్తుంటే... అడుగడుగునా అడ్డుపడుతూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగిస్తామంటూ ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చా రని... అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రద్దు మాటే ఎత్తకుండా ఉద్యో గులను మోసం చేశారని దుయ్యబట్టారు. పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయ కులను ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేయడం, నోటీసుల జారీతో అణచివేతకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీపీఎస్‌ రద్దును సాధిస్తామంటూ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.





 

Updated Date - 2022-08-31T06:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising