ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-09-09T04:27:34+05:30

ప్రభుత్వం నిర్దేశించిన పనుల్లో పురోగతిని సాధించే దిశగా ఆయా శాఖలు లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది


రాయచోటి (కలెక్టరేట్‌), సెప్టెంబరు 8: ప్రభుత్వం నిర్దేశించిన పనుల్లో పురోగతిని సాధించే దిశగా ఆయా శాఖలు లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి గోపాలకృష్ణతో పాటు కమిషనర్‌ కోన శశిధర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం, గ్రామ పంచాయతీల్లో అమలు, పారిశుధ్యం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేడుతున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌ తదితర పథకాలపై కలెక్టర్లతో వారు సమీక్షించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీపీవోను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. చెత్త సంపద తయారీ కేంద్రాలను ఈవోపీఆర్‌డీలు, ఎంపీడీవోలు తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌లు, డిజిటల్‌ టైబ్రరీలు, బీయంసీయూ భవన నిర్మాణాలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ పీవీ ప్రసన్నకుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సురే్‌షకుమార్‌, డీపీవో నాగరాజు, డ్వామా పీడీ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.


స్పందన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

సుస్థిర సమగ్రాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. గురువారం వెలగపూడిలోని సచివాలయం నుంచి టాప్‌ ఫోర్‌ ప్రియరిటీ సర్వీస్‌, స్పందన, హౌసింగ్‌, సుస్థిర సమగ్రాభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటి పారుదల, పరిశ్రమలు, మానవ వనరుల కల్పన తదితర కీలక అంశాల్లో సుస్థిరమైన, సమగ్రమైన అభివృద్ధి సాధించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ టాప్‌ ఫోర్‌ ప్రియారిటీ సర్వీస్‌, టాప్‌టెన్‌ ప్రయారిటీ సర్వీస్‌, ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్యలను గడువులోగా అర్జీలను పరిష్కరించాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని హౌసింగ్‌ పీడీని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణ, హౌసింగ్‌ పీడీ శివయ్య, కలెక్టరేట్‌ ఏవో బాలకృష్ణ, వీఎ్‌సడబ్ల్యు ఎస్‌ఏవో మోహన్‌రాజు, డీపీవో నాగరాజు, డీఆర్‌ డీఏ పీడీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-09T04:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising