ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూగజీవాల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా

ABN, First Publish Date - 2022-05-20T05:30:00+05:30

మూగజీవాల ప్రాణాలకు వైసీపీ ప్రభుత్వం భరోసానిస్తోందని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ పీఎస్‌ గిరీష, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు సుకుమార్‌రెడ్డి, అప్కాబ్‌ చైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీ అన్నారు.

పశుసంచార వాహనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్‌, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

108 తరహాలో సంచారా పశువైద్య అంబులెన్స్‌లు


రాయచోటిటౌన్‌, మే 20: మూగజీవాల ప్రాణాలకు వైసీపీ ప్రభుత్వం భరోసానిస్తోందని  ఎమ్మెల్యేలు గడికోట  శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ పీఎస్‌ గిరీష, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు సుకుమార్‌రెడ్డి, అప్కాబ్‌ చైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీ అన్నారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లాకు చెందిన వైసీపీ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 108 తరహాలో పశువుల అంబులెన్స్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు 1962 టోల్‌ నెంబరుకు కాల్‌ చేస్తే వాహనంతో సహా పశువైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని వైద్యం అందిస్తారన్నారు. ఈ వాహనంలో పశువైద్యుడితో పాటు వెటర్నరీ డిప్లమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌, అటెండర్‌, ముగ్గురు సిబ్బంది ఉంటారన్నారు. కార్యక్రమలో పశుసంవర్థకశాఖ డీడీ గుణశేఖర్‌పిళ్లై, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు దిన్నెపాడు రవిరాజు, మాజీ ఎంపీపీ అంపాబత్తిన రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు. 



 

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising