ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులను కరుణించిన అన్నపూర్ణేశ్వరి దేవి

ABN, First Publish Date - 2022-09-30T05:26:17+05:30

శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులను కరుణించా రు.

రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణుని బొమ్మల కొలువుమాత...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌/బద్వేలు, రూరల్‌/పోరుమామిళ్ల/
జమ్మలమడుగు రూరల్‌/ఎర్రగుంట్ల/కొండాపురం/ మైదుకూరు రూరల్‌/దువ్వూరు, , సెప్టెంబరు 29:

శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులను కరుణించా రు. అమ్మవారిశాల, రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం, భగత్‌సింగ్‌ కాలనీలోని పెద్దమ్మ ఆలయాల్లో అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమించారు. చెన్నకేశవస్వామి ఆల యంలో గజలక్ష్మిదేవిగా, ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో శారదాదేవిగా అమ్మవారు భక్తులను కరుణించా రు. రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయంలో బొమ్మల కొ లువు ఆకట్టుకుంది. బద్వేలు అమ్మవారిశాలలో రాజ రాజే శ్వరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శన మి చ్చారు. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం లో జగన్మోహినిదేవి అలంకారం, ఆలయంలో తోటోత్సవం నిర్వ హించారు. రామాలయం, మహాలక్ష్మీదేవి ఆలయాల్లో శర న్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోరుమామిళ్ల లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి అ నంత పద్మనాభ స్వామి అలంకారం చేశారు. వాసవీ కన్య కాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కామాక్షీ దేవిగా అలంకరించారు. జమ్మలమడుగు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి అమ్మవారు బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ముద్దనూరు రోడ్డు సాయిబాబా ఆలయంలో అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎర్రగుంట్ల వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిలమకూరు లోని శ్రీగోదామహాలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం లో అమ్మవారు గజలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులు దర్శిం చుకున్నారు. కొండాపురం మండలం దత్తాపురంలో వెలసిన పెద్దమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం ఆలయంలో పెద్దమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణదేవిగా అలంకరించారు. కొలువుదీరిన అన్నపూర్ణదేవి అమ్మవారిని భక్తులు దర్శించి కనులారా వీక్షించారు. మైదుకూరు అమ్మవారిశాలలో గురువారం శ్రీమహాలక్ష్మిగా అలంకరించారు. భక్తులతో ఆలయం సంద డిగా మారింది. మండల కేంద్రం దువ్వూరు కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో మాతా గంగాభవానీ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం అమ్మవారు భక్తులకు ధనలక్ష్మిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలో సుప్రబాతసేవ, చండీపారాయణం నిర్వహించారు.









Updated Date - 2022-09-30T05:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising