ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ వినోదినికి గిడుగు రామమూర్తి భాషా పురస్కారం

ABN, First Publish Date - 2022-08-27T05:22:16+05:30

వైవీయూనివర్శిటీ తెలుగు విభాగం అధ్యాపకురాలు డాక్టర్‌ ఎంఎం వినోదిని గిడుగు రామమూర్తి భాషా పురస్కారానికి ఎంపికయ్యారు.

డాక్టర్‌ ఎం.ఎం.వినోదిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప వైవీయూ, ఆగస్టు 26: వైవీయూనివర్శిటీ తెలుగు విభాగం అధ్యాపకురాలు డాక్టర్‌ ఎంఎం వినోదిని గిడుగు రామమూర్తి భాషా పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగుభాషా సాహిత్య రంగంలో కృషి చేసినవారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిఏటా పురస్కారం ప్రదానం చేస్తుంది. ఇందులో భాగంగా ఈనెల 29వ తేదీ విశాఖపట్టణంలో జరుగనున్న మాతృభాష దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వినోదినికి పురస్కారం ప్రదానం చేయనుంది. ‘సంతకం- కవిత్వ పరామర్శ’ పేరుతో వంద వారాలపాటు నిరవధికంగా ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా కవిత్వ పుస్తకాలను విశ్లేషించినందుకు పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమె రచనలు, జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. సోమసుందర్‌ జాతీయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉగాది ప్రతిభా పురస్కారం, చాసో జాతీయ పురస్కారం, కీర్తికోవెల పురస్కారం, రంగినేని యల్లమ్మ జాతీయ పురస్కారం, మల్లెమాల జాతీయ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ జాతీయ పురస్కారం, కొలకలూరి విశ్రాంతమ్మ జాతీయ విమర్శ పురస్కారం, జానమద్ది హనుమచ్ఛాస్త్రి జాతీయ పురస్కారం ఇదివరకే అందుకున్నారు. 


 

Updated Date - 2022-08-27T05:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising