నేటి నుంచి గౌరీ పూజ
ABN, First Publish Date - 2022-11-08T23:27:32+05:30
కార్తీకమాసం సందర్భంగా స్థానిక వాసవీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో గౌరీదేవి పూజ 5 రోజుల పాటు చేపట్టనున్నారు. ఈ మేరకు వివరాలను మహిళామండలి అధ్యక్షురాలు మాలేపాటి పద్మజ విలేకరులకు వెల్లడించారు.
మైదుకూరు, నవంబరు 8 : కార్తీకమాసం సందర్భంగా స్థానిక వాసవీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో గౌరీదేవి పూజ 5 రోజుల పాటు చేపట్టనున్నారు. ఈ మేరకు వివరాలను మహిళామండలి అధ్యక్షురాలు మాలేపాటి పద్మజ విలేకరులకు వెల్లడించారు. బుధవారం సాయంత్రం సాయినాథపురంలోని షర్డిసాయిబాబా ఆలయాన్ని కన్యకలు, మహిళలు గౌరీ దేవి కలిశాలను తీసుకువచ్చి అమ్మవారిశాలలో ప్రతిష్ఠిస్తామన్నారు. గురువారం ఉదయం దంపతులచే గౌరీ పూజ శుక్రవారం, శనివారం కన్యకలు,మహిళలచే సామూహిక వ్రతం చేస్తామన్నారు. చివరి రోజు ఆదివారం గౌరీ మాతను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక ఎర్రచెరువులో నిమజ్జనం చేస్తామన్నారు.అనంతరం వనభోజనాల కార్యక్రమం ఉంటుందని ఆర్యవైశ్యులు పాల్గొనాలని ఆమె కోరారు.
Updated Date - 2022-11-08T23:27:50+05:30 IST