ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెక్‌ పవర్‌ రద్దుపై గరం గరం

ABN, First Publish Date - 2022-01-28T05:38:00+05:30

కడప జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) సర్వసభ్య సమావేశం గరం గరంగా సాగింది. డీసీసీ బ్యాంకు, ఆప్కాబ్‌ ఛైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీరాణి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సా గింది. రైతు రుణాల మంజూరు నియమావళి.. ఇందులో చోటుచేసుకున్న మార్పులు, లోటుపాట్లపై చర్చసాగింది.

పోడియం వద్దకు దూసుకెళ్లి నిలదీస్తున్న సొసైటీ అధ్యక్షులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రసాభాసగా డీసీసీబీ సర్వసభ్య సమావేశం

కడప రూరల్‌, జనవరి 27: కడప జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) సర్వసభ్య సమావేశం గరం గరంగా సాగింది. డీసీసీ బ్యాంకు, ఆప్కాబ్‌ ఛైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీరాణి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సా గింది. రైతు రుణాల మంజూరు నియమావళి.. ఇందులో చోటుచేసుకున్న మార్పులు, లోటుపాట్లపై చర్చసాగింది. రుణాల మంజూరులో రైతులకు చెక్కులు ఇచ్చేటప్పుడు ఇదివరకు తమకున్న చెక్‌ పవర్‌ను రద్దు చేయడం సరికాదని వల్లూరు, ఎల్లటూరు, చింతలమడుగు వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, కంబం నాగేంద్రారెడ్డి, యల్లారెడ్డి తదితరులు సభలో దూమారం రేపారు. ఈ వ్యవహారంపై డీసీసీబీ సీఈవో ఎస్‌.విజయభాస్కర్‌రెడ్డిని నిలదీశారు. తమ హక్కులను సీఈవో కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. అధ్యక్షుల ప్రశ్నలకు సీఈవో ఘాటుగా మాట్లాడడంతో ఇరు పక్షాల మధ్య మాటకు మాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. సీఈవో ప్రవర్తన సరిగా లేదంటూ సొపైటీ అధ్యక్షులు మూకుమ్మడిగా పోడియం వద్దకు దూసుకెళ్లి ఆయనను చుట్టుముట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. వెంటనే చైర్‌పర్సన్‌ ఝాన్సీరాణి సమావేశాన్ని సజావుగా నడిపించేందుకు తీవ్ర ప్రయత్నంచేసినా సాధారణ పరిస్థితికి రాలేదు. ఒకానొక దశలో సొసైటీల అధ్యక్షులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లి పోయారు. తరువాత అధికారులు ప్లీజ్‌ ప్లీజ్‌ అంటూ కొందరని సమావేశానికి రప్పించుకొని సోసైటీ అధ్యక్షులకు చెక్‌పవర్‌ను రద్దుచేయలేదని, ఇది కేవలం అపోహ మాత్రమేనని సర్దిచెప్పారు. 


రైతు సంక్షేమమే లక్ష్యం  

రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీసీసీబీ, ఆప్కాబ్‌ ఛైర్‌పర్సన్‌ ఎం.ఝాన్సీరాణి పేర్కొన్నారు. డీసీసీబీ పాలకవర్గ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండుమూడు నెలల్లో ఇతర వాణిజ్య బ్యాంకుల వలె ఫోన్‌-పే, నెట్‌ బ్యాంకింగ్‌ లాంటి సదుపాయాలు డీసీసీబీ ఖాతాదారులకు కూడా ఇవ్వనున్నామన్నారు. అలాగే వీలైనంత త్వరలో అన్ని సహకార సంఘాలు కూడా అన్‌-లైన్‌ చేయబడతాయన్నారు.

Updated Date - 2022-01-28T05:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising