ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడప గడపలో.. ఎమ్మెల్యేకు సమస్యల హారతి

ABN, First Publish Date - 2022-09-30T05:26:21+05:30

డప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి ప్రజలు సమస్యలతో హారతి పట్టారు.

కంపచెట్ల నడుమ వర్షపునీటిలో వెళుతున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రోడ్ల సౌకర్యం లేదంటూ ఫిర్యాదు

చిన్నమండెం, సెప్టెంబరు 29: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి ప్రజలు సమస్యలతో హారతి పట్టారు. గురువారం ఆయన మండలం లోని కేశాపురం గ్రామంలో పర్యటించారు. తమ కు పెన్షన్లు రాలేదని, తమ ఊరికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, మంచినీటి వసతి లేదని, పంట నష్టపరిహారం రాలేదని.. పలువురు తమ సమ స్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కేశాపురం కస్పా నుంచి హరిజనవాడకు వెళ్లే దారిలో కం పచెట్లతో రోడ్డు మూసుకుపోయి, వర్షపునీళ్లు ప్రవహిస్తూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వర్షపునీటిలో నడుచుకుంటూ.. కేశాపురం కస్పా లోకి వచ్చారు. సద్దలగుట్టపల్లెలోని ఓ మహిళ ఊరికి రెండు బోర్లు ఉన్నా.. తమ వీధికి మాత్రం తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్య ఎవరూ పట్టించుకోలేదంటూ వాపో యింది. అదే గ్రామంలో లక్ష్మమ్మ అనే ఓ మహి ళ తన భర్త చనిపోయి మూడేళ్లవుతున్నా వితం తు పింఛన్‌ రాలేదని తెలిపింది. ప్రభుత్వ కార్యా లయాల చుట్టూ తిరిగి తిరిగి.. విసుగు పుడు తోందని వాపోయింది. సద్దలగుట్టపల్లెలో రోడ్డు కు అడ్డంగా విద్యుత్‌ ఫోల్‌ ఉందని చెప్పగా వెంటనే ఏఈ కిశోర్‌కు ఆ ఫోల్‌ మార్పించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ దేవనాధరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ముసల్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీవో దివ్య, తహసీల్దార్‌ రాములునాయక్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T05:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising