ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీలు నెరవేర్చండి

ABN, First Publish Date - 2022-01-25T04:30:25+05:30

ఎన్నికల సమయంలో మున్సిపల్‌ కార్మికులను ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాలని మున్పిపల్‌ కార్మికులు డిమాండు చేశారు.

నిరసన తెలియజేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరసన ప్రదర్శనలో మున్సిపల్‌ కార్మికులు

ప్రొద్దుటూరు, జనవరి 24 : ఎన్నికల సమయంలో మున్సిపల్‌ కార్మికులను ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాలని మున్పిపల్‌ కార్మికులు డిమాండు చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వార్డు సచివాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జీవో నెంబరు 7 ప్రతులను దహనం చేశారు. ఆ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు విజయకుమార్‌, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చంటి, సాల్మోన్‌లు మాట్లాడుతూ జీవో 15, 16లను అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరి 7వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణమ్మ, కోశాధికారి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు గురమ్మ, రమాదేవి, నీలిమ, నరసమ్మ, మున్పిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising