ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25న గండి క్షేత్రం నుంచి హనుమాన్‌ శోభాయాత్ర

ABN, First Publish Date - 2022-05-23T05:05:54+05:30

హనుమత్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా 25 న గండి క్షేత్రం నుంచి హనుమాన్‌ శోభాయా త్ర నిర్వహిస్తున్నట్లు వేంకటేశ్వర, రాచరాయ ఆలయ అభివృద్ధి కమి టీ పిలుపునిచ్చింది.

నెర్సుపల్లె హరిజనవాడలో శోభాయాత్ర ప్రచారం చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, మే 22: హనుమత్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా 25 న గండి క్షేత్రం నుంచి హనుమాన్‌ శోభాయా త్ర నిర్వహిస్తున్నట్లు వేంకటేశ్వర, రాచరాయ ఆలయ అభివృద్ధి కమి టీ పిలుపునిచ్చింది. ఆలయ కమిటీ చైర్మన్‌ తంగెడుపల్లె ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో 25న ఉదయం 7గంటలకు గండి క్షేత్రంలో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. శోభాయాత్రను మండలంలోని హిందూ సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అద్దాలమర్రి, కుమార్లకాల్వ, చెరుకాంపల్లె, ఎరబొమనపల్లె, కె రాజుపల్లె, కుప్పం, గంగారపువాండ్లపల్లె, మహదేవపల్లె, సురభి, చిలేకాంపల్లె గ్రామాల మీదుగా కొనసాగి మధ్యాహ్నం చక్రాయపేట మండల కేంద్రం వేంకటేశ్వర, రాచరాయ దేవస్థానం చేరుకుంటుందన్నారు.

అక్కడ అన్నదానం చేపడతారన్నారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, ఆల య మాజీ చైర్మన్లు లాయర్‌ రామాంజులరెడ్డి, చక్రపాణిరెడ్డి, హరినాథరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఈశ్వరయ్య, సభ్యులు రంగారెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, నాగభూషణం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising