ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల చుట్టూ వరద నీరు

ABN, First Publish Date - 2022-12-15T23:12:38+05:30

ఒకసారి కాదు, రెండుసార్లు కాదు గత కొన్ని సంవత్సరాలుగా పైగా చెయ్యేరుకు నీరు వచ్చిందంటే పరిసర ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

వీధులలో చేరిన నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆందోళనలో ప్రజలు

నందలూరు, డిసెంబరు 15: ఒకసారి కాదు, రెండుసార్లు కాదు గత కొన్ని సంవత్సరాలుగా పైగా చెయ్యేరుకు నీరు వచ్చిందంటే పరిసర ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది నవంబరులో వచ్చిన వరదలకు చెయ్యేరు, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల వచ్చిన మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో నదిలోకి వస్తున్న నీరంతా ప్రాజెక్టులో నిల్వ ఉండకుండా చెయ్యేరులో పారుతోంది. నదికి ఆనుకుని ఉన్న నందలూరులోని కాల్వలు ఆక్రమణలకు గురి కావడంతో నీరంతా నందలూరు నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని గొల్లపల్లె, నీలిపల్లె, విద్యానగర్‌, గణేష్‌ నగర్‌ ప్రాంతాల్లోని వీధులు, ఇళ్ల మధ్యలో చేరుతోంది. దీంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాల్వలు, నీటి వనరుల ఆక్రమణలతోనే తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్‌ఎస్‌ రోడ్డుతో పాటు కడప-తిరుపతి ప్రధాన రహదారిలోని ప్రధాన కాల్వలు కబ్జాకు గురి కావడంతోనే నీరంతా ఇక్కడకు వస్తోందని తెలిపారు. వరదనీరు వచ్చినపుడు అధికారులు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక పనులు చేయడం తప్ప, శాశ్వత ప్రాతిపదికన నీటి వనరుల కబ్జాలను అరికట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ గిరీషా మా గోడును ఆలకించి వరద నీటి బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-15T23:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising