ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు

ABN, First Publish Date - 2022-05-17T05:11:43+05:30

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 20 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు


రాయచోటి క్రైం, మే 16: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 20 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మాకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు ఎస్‌డీపీవో శివభాస్కర్‌రెడ్డి, రైల్వేకోడూరు సీఐ విశ్వనాధరెడ్డిల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజపురం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇతియోస్‌ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులతో పాటు 6 ఎర్రచందనం దుంగలు దొరికాయన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు గంగరాజుపోడు వద్ద మరో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 14 ఎర్రచందనం దుంగలు, టాటామ్యాక్స్‌ వాహనం బజాజ్‌ ఆటోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడూరుకు చెందిన సింగమాల సురేష్‌, గాలితోట జాన్‌, కోటేశ్వర్‌, సేళ్ల గంగాధర్‌, పసుపులేటి బాలాజీలను అరెస్టు చేశామని తెలిపారు. స్మగ్లర్లను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 



Updated Date - 2022-05-17T05:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising