వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు
ABN, First Publish Date - 2022-12-16T23:14:18+05:30
మద్విరాట్ పోతులూరి వీరబ్ర హ్మేంద్రస్వామి మనవరాలు ఈశ్వరి మహాదేవి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు రెం డురోజుల నుంచి వైభవంగా చేపట్టారు.
బ్రహ్మంగారిమఠం, డిసెంబరు 16: మద్విరాట్ పోతులూరి వీరబ్ర హ్మేంద్రస్వామి మనవరాలు ఈశ్వరి మహాదేవి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు రెం డురోజుల నుంచి వైభవంగా చేపట్టారు. ఈశ్వరీదేవి మఠం మఠాధిపతి వీర కుమారస్వామి ఆధ్వర్యంలో అమ్మవారి ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం జగన్మాత ఈశ్వరీదేవి అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం
శనివారం మార్గశిర బహుళ నవమిన జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారు సజీవ సమాధి నిష్ట వహించిన సుదినం. అమ్మవారి ఆరాధన మహోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి ఈశ్వరీదేవి మఠానికి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు, ఆలయ ప్రాంగణలో తాగునీరు, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-12-16T23:14:20+05:30 IST