ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-07-04T06:00:27+05:30

మండలంలోని కుచ్చుపాప గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున సిర్లు గోపాల్‌ (51) అనే రైతు అప్పుల బాధతో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... గోపాల్‌కు మూడు ఎకరాల భూమి ఉండగా... గత కొన్నేళ్లేగా ఆ భూమిలో పలు రకాల పైర్లు సాగు చేసినా దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాపాడు, జూలై 3: మండలంలోని కుచ్చుపాప గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున సిర్లు గోపాల్‌ (51) అనే రైతు అప్పుల బాధతో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... గోపాల్‌కు మూడు ఎకరాల భూమి ఉండగా... గత కొన్నేళ్లేగా ఆ భూమిలో పలు రకాల పైర్లు సాగు చేసినా దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో సుమారు రూ.20 లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. ఇటీవల ఆ భూమిలో బోరు, పైపులైను వేయగా మరో రూ.3లక్షలు ఖర్చు అయిందన్నారు. దీంతో  చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో  చెల్లించే పరిస్థితి లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గోపాల్‌ మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహానికి ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అతని కుమారుడు రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-07-04T06:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising