ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరం

ABN, First Publish Date - 2022-05-27T04:56:19+05:30

వేసవి శిక్షణ శిబిరాన్ని ఉ త్సాహంగా సద్వినియో గం చేసుకోవాలని నిర్వా హకులు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో విద్యార్థుల కోసం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించింది.

విద్యార్థులను పరిచయం చేసుకుంటున్న ఉత్తమారెడ్డి , క్రీడల ఆవశ్యకతను వివరిస్తున్న స్టెప్‌ సీఈఓ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికెదిన్నె, మే 26: వేసవి శిక్షణ శిబిరాన్ని ఉ త్సాహంగా సద్వినియో గం చేసుకోవాలని నిర్వా హకులు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో విద్యార్థుల కోసం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లె శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల మైదానంలో మే నెల మొదటి నుంచి విద్యార్థులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. మూడు రకాల క్రీడాంశాల్లో కోచ్‌లు ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తూ నడిపిస్తున్నారు.  గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా రోజూ పిల్లలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారు.

ఆరోగ్యం పెంపొందుతుంది 

విద్యార్థుల్లో క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం, పరస్పర సహకార భావం పెంపొందుతుందని స్టెప్‌ సీఈఓ బ్రహ్మ య్య సూచించారు. దీని ద్వారా ఒకరికొకరు సహాయపడేందుకు ఉపయోగపడడం, భవిష్యత్తులో ఏ విధంగా నడుచుకోవాలో చక్కగా ఉపయోగపడుతుంది. 

ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి

 విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని ఉన్నతస్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని టర్నింగ్‌పాయింట్‌ కోచింగ్‌ సెంటర్‌ అధినేత ఉత్తమారెడ్డి సూచిం చారు. వెంకటేశ్వర హౌస్కూల్‌ మైదానంలో జరుగుతున్న వేసవి శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు, చదువులోనూ రాణిస్తే ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. నవోదయ, సైనిక్‌స్కూల్‌, వివిధ పోటీ పరీక్షల్లో సీట్లు సాధించి వారి ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు ఉపయోగించుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. 

ఇంటివద్ద ఖాళీగా ఉండకుండా...

 హాకీలో రోజూ కోచ్‌ ఖాదర్‌బాష ద్వారా మెలకువలు నేర్చుకుని శిక్షణ పొందుతున్నాము. ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా వేసవి శిబిరాలు చక్కగా ఉపయోగపడుతున్నాయి.

అంకిత , హాకీ క్రీడాకారిణి

సలహాలు ఉపయోగపడుతున్నాయి

ఖోఖోలో రాణించేందుకు కోచ్‌ పవన్‌ సలహా లు ఉపయోగపడుతున్నాయి. ఖాళీ సమయం, సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు శిక్షణ ఉపయోగపడుతుంది 

రాణి, ఖోఖో విద్యార్థిని

మెలకువలు నేర్చుకుంటున్నా

వాలీబాల్‌లో కోచ్‌ గౌస్‌బాష ద్వారా మరిన్ని మెలకువలు నేర్చుకుని క్రీడా పటిమతో సాధన చేస్తున్నాం. గ్రామీణ విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. ్త

నోమిత, వాలీబాల్‌ క్రీడాకారిణి



Updated Date - 2022-05-27T04:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising