ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందన ఫిర్యాదులకు ఆధారాలు జతచేయాలి

ABN, First Publish Date - 2022-08-09T05:24:41+05:30

స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు సంబంధిత ఆధారాలను తప్పనిసరిగా జతచే యాలని ఆర్డీవో మురళి సూచిం చారు.

స్పందన కార్యక్రమంలో ప్రజల అర్జీలను పరిశీలిస్తున్న ఆర్డీవో మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 8: స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు సంబంధిత ఆధారాలను తప్పనిసరిగా జతచే యాలని ఆర్డీవో మురళి సూచిం చారు. సోమవారం స్థానిక సబ్‌ కలె క్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి డివిజన్‌ నలుమూల ల నుంచి 41 మంది అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వ్యక్తిగత ఫిర్యాదులు, భూ లావాదేవిలపై ప్రజలు ఇచ్చే అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాకే పరిష్కరిస్తున్నామన్నారు. భూ సమస్యలు, భూ సర్వే, పాసుపుస్తకాలు, పింఛన్లు సంబంధిత అధికారులకు రెఫర్‌ చేశారు. స్పందనలో వచ్చే అర్జీలను వారం రోజుల్లో పరిష్క రించాలని, పరిష్కరించేలేని సమస్యలపై అర్జీదారులకు వివరణ పంపాలని  మండల అధికారులను ఆర్డీవో ఆదేశించారు. 

మదనపల్లె రూరల్‌లో: మదనపల్లె మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన  కార్యక్రమంలో నాలుగు సమస్యలు వచ్చాయని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వి.మనూజ, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల తెలిపారు. ఇందులో ముఖ్యంగా వీవర్స్‌కాలనీలో శ్రీనివాసులు అనేవ్యక్తి రోడ్డును ఆక్రమించి రూమును నిర్మిస్తున్నారని, బుగ్గకాలువ మసీదు వీధిలో రోడ్లు వేయాలని, గాంధీపురం ఏరియాలో నీటిసరఫరా చేయడం లేదని, మోతీనగర్‌లో ఎండోమెంట్‌ భూమి రికార్డు తప్పుగా ఉందని దీనిని సరిచేయాలని స్థానికులు అర్జీలు ఇచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కమిషనర్‌ తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T05:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising