ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో మహిళా కోర్టు ఏర్పాటు

ABN, First Publish Date - 2022-01-22T05:38:01+05:30

జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో నూతనంగా మహిళా కోర్టును (7వ అదనపు కోర్టు) ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా వర్చువల్‌ విధానంలో హైకోర్టు జడ్జి (కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి) మఠం వెంకటరమణతో కలసి ప్రారంభించారు.

మహిళా కోర్టు ప్రారంభం అనంతరం మాట్లాడుతున్న జిల్లా ప్రధాన జడ్జి పురుషోత్తంకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్చువల్‌లో ప్రారంభించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

కడప(రూరల్‌), జనవరి 21: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో నూతనంగా మహిళా కోర్టును (7వ అదనపు కోర్టు) ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా వర్చువల్‌ విధానంలో హైకోర్టు జడ్జి (కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి) మఠం వెంకటరమణతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఈ కోర్టు ప్రాముఖ్యత, విధివిధానాలను తెలియజేశారు. ఇక నుంచి సదరు కోర్టు ద్వారా మహిళల కేసుల విచారణ మరింత వేగవంతంగా, పారదర్శకంగా విచారణ చేయడానికి వీలుపడుతుందన్నారు. అనంతరం జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తం కుమార్‌, ఎస్సీ అన్బురాజన్‌, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, ఇతర జడ్జిలు, అధికారులతో కలిసి ఫ్యామిలీ కోర్టు జడ్జి చాంబర్‌ను, కోర్టు హాలును ప్రారంభించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన 7వ అదనపు జిల్లా కోర్టు (స్పెషల్‌ కోర్టు ఫార్‌ ట్రయల్‌ ఆఫ్‌ అఫెన్స్‌ అగెయినెస్ట్‌ ఉమన్‌) కోర్టులో 6వ అదనపు జిల్లా కోర్టు జడ్జి జి.గీతా మహిళా కక్షిదారులకు చెందిన కేసులను విచారించారు. ప్రారంభ కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాస్‌ శివరామ్‌, పలు కోర్టుల జడ్జిలు, కడప బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎ.సీతారామ్‌, జింకా సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శి అరుణకుమారి, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T05:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising