ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-12-15T23:34:10+05:30

పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సూచించారు. మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. తొలుత పశువైద్య చికిత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌చైర్మన్‌

ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 15 : పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సూచించారు. మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. తొలుత పశువైద్య చికిత్స సముదాయంలో ఉన్న శస్త్రచికిత్స, సాధారణ వ్యాధులు, గర్భకోశ వ్యాధులకు సంబంధించిన విభాగాల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పశుక్షేత్ర సముదాయంలోని ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్ల జాతులను సందర్శించారు. వివిధ విభాగాల్లో ఉన్న సౌకర్యాలు, ప్రయోగశాలలు, ప్రదర్శనలను తరగతి గదులను పరిశీలించారు. ఉన్న వసతులపై, నూతన సదుపాయాల గురించి అధ్యాపకులతో, విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ శ్రీలత, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, అగ్రిమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబరు ఎస్‌.శివప్రసాద్‌రెడ్డి, జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్‌ శివప్రసాద్‌రెడ్డి, ఏడీ డాక్టర్‌ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising