ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొసైటీ గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి : ఆర్డీవో

ABN, First Publish Date - 2022-05-25T04:59:28+05:30

గోపవరం జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీలోని కాలనీ-1, 2 గ్రామాల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బద్వేలు రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు.

గ్రామ సభలో మాట్లాడుతున్న ఆర్డీవో ఆకుల వెంకటరమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపవరం, మే 24 : గోపవరం జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీలోని కాలనీ-1, 2 గ్రామాల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బద్వేలు రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం కాలనీ-1లో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా  గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  సమస్యల పరిష్కారం కోసం అధికారులు అన్ని విధాలా సహకరించాలని కోరారు. ఈ విషయమై ఆర్డీవో వెంకటరమణ మాట్లాడుతూ  సెంచరీ ప్లేవుడ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజల సహకారం ప్రశంసనీయమన్నారు. సొసైటీ గ్రామాల ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. భూములకు సంబంధించి ఆన్‌లైన్‌ చేయడంతో పాటు భూ హక్కులు కల్పిస్తామన్నారు. నిర్ణీత సమయంలో పాసుపుస్తకాలు అందజేసేందుకు నిర్ణీత గడువులోపు చర్యలు తీసుకుంటామన్నారు. భూముల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం ద్వారా పంటల సాగుకు సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రమణారెడ్డి, సర్పంచ్‌ లక్ష్మీదేవి, ఆర్‌ఐ నాగేశ్వరి, హరి, సతీష్‌, వీఆర్వో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి విజయకుమార్‌, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T04:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising