ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రబీ పంటలకు ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-12-22T23:07:00+05:30

రబీ-2022 సీజ న్‌లో సాగుచేసిన పంటలకు ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలని మండల వ్యవసా యాధికారి రమేష్‌ రైతులకు సూచించా రు.

బోనాలలో పంట నమోదును పరిశీలిస్తున్న ఏఓ రమేష్‌ - పంట నమోదును పరిశీలిస్తున్న ఏఓ శ్యామ్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాల, డిసెంబరు 22: రబీ-2022 సీజ న్‌లో సాగుచేసిన పంటలకు ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలని మండల వ్యవసా యాధికారి రమేష్‌ రైతులకు సూచించా రు. గురువారం బోనాలలో జరుగుతున్న ఈ-క్రాప్‌ బుకింగ్‌ను పరిశీలించిన ఏఓ మాట్లాడుతూ ప్రతి పంట కూడా ఆర్బీకే ఇన్‌చార్జి ద్వారా బుకింగ్‌ చేస్తారన్నారు. పంట వేసిన ప్రతి రైతు ఈ-క్రాప్‌ బు కింగ్‌ చేసుకోవాలన్నారు. లేదంటే ఇన్సూ రెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ, మద్దతు ధర, సున్నావడ్డీ తదితర ప్రభుత్వ పథకాలు వర్తించవన్నారు.

ప్రకృతి వ్యవసాయ పద్దతుల ద్వారా శనగ పంట సాగు చేసి టీటీడీకి ఇవ్వాల ని నిర్ణయించుకున్న రైతులు ఈ-క్రాప్‌ బుకింగ్‌ సమయంలోనే ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేస్తున్నట్లు నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో ఆర్బీకే సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతు నమోదు చేయించుకోవాలి

వీరపునాయునిపల్లె, డిసెంబరు 22: సాగుచేసిన పంటనూ రైతు తప్పకుండా పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్యామ్‌బాబు సూచించారు. గురువారం కొమ్మద్ది, తలపనూరు గ్రామాల్లో జరుగుతున్న పంట నమోదును పరిశీలించిన ఏఓ మాట్లాడుతూ పంట నమోదు చేసుకున్న రైతులకు రైతు భరో సా, పంటల బీమా, సున్నా వడ్డీ, పంట దిగుబ డుల కొనుగోలు వంటి ప్రభుత్వ పథకాలు ఈ-క్రాప్‌ నమోదు చేసుకున్న రైతులకే వర్తిస్తా యని తెలిపారు.

క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్న సిబ్బంది ని ఏ విధమైన పొరపాట్లకు తావులేకుండా పంట నమోదు చేయాలని సూచించారు. శనగ పంటలో కాండం, వేరుకుళ్లు తెగుళ్లను గమనిం చామని, దాని నివారణకు టేబుకోనజోల్‌ 1ఎంఎ ల్‌, 13.0.45ను 10గ్రాముల చొప్పున లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్ర మంలో వ్యవసాయ సహాయకులు గురుప్రసాద్‌ నాయక్‌, బాష, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-22T23:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising