ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీతో ఆర్థిక వ్యవస్థ నాశనం

ABN, First Publish Date - 2022-12-07T23:55:53+05:30

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, వ్యవసాయ రంగాన్ని, రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బుధవారం రాయచోటిలోని ప్రీతం ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేథావులను జైళ్లకు పంపుతున్నారు

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి

రాయచోటి టౌన్‌, డిసెంబరు 7: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, వ్యవసాయ రంగాన్ని, రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బుధవారం రాయచోటిలోని ప్రీతం ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కోట్లాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని, ఉన్నతమైన చదువులు చదువుకున్న వారు భవన నిర్మాణ కార్మికులుగా మారిపోయారన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల సాకు చెప్పి ప్రైవేటు వారికి కారు చౌకగా అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న వామపక్ష మేథావులు, హక్కుల నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాట తప్పాడని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్‌, రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సాంబశివ, విశ్వనాధ్‌నాయక్‌, రాధాకృష్ణ, సుమిత్ర, కోటేశ్వరరావు, వెంకటేష్‌, మనోహర్‌రెడ్డి, సుధీర్‌, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising