ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి దసరా వేడుకలు

ABN, First Publish Date - 2022-09-26T04:59:18+05:30

శ్రీకన్యకాపరమేవ్వరీ దేవీ శరన్నవరాత్ర దసరా మహోత్సవాలకు అమ్మవారిశాలలు ముస్తాబయ్యాయి. ఎర్రగుంట్ల మెయిన్‌ బజార్‌లోని శ్రీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయలో నేటి నుంచి ఎర్రగు ంట్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసర ఉత్సవాలు జరుపుతున్నారు.

ఎర్రగుంట్లలో విద్యుద్దీపకాంతులతో విరాజిల్లుతున్న ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 25: శ్రీకన్యకాపరమేవ్వరీ దేవీ శరన్నవరాత్ర  దసరా మహోత్సవాలకు అమ్మవారిశాలలు ముస్తాబయ్యాయి. ఎర్రగుంట్ల మెయిన్‌ బజార్‌లోని శ్రీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయలో నేటి నుంచి ఎర్రగు ంట్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసర ఉత్సవాలు జరుపుతున్నారు. విద్యుద్దీప కాంతులతో విరాజిల్లే విధంగా ముస్తాబు చేశారు. 26వ తేదీ సోమవారం నుంచి అక్టోబరు  6వరకు  అమ్మవారికి రోజుకో అలంకరణతో ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 

ఎర్రగుంట్ల అమ్మవారిశాలలో అలంకారాలు 26వ తేదీన శ్రీరాజరాజేశ్వరీదేవి, 27న శ్రీభవానిదేవి, 28శ్రీశార దాదేవి, 29నశ్రీ అన్నపూర్ణాదేవి, 30నశ్రీదేవీవనవిహారిణీ, 1వ తేదీనశ్రీ గజలక్ష్మిదేవి, 2న శ్రీ సరస్వతీదేవి, 3వతేదీన శ్రీమహిషాసురమర్ధినిదేవి, 4న శ్రీగాయత్రీదేవి, 5న శ్రీవిజయలక్ష్మీదేవి, 6న శ్రీవాసవి కన్యకాంబదేవి అలం కారాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం తెలిపింది. 

ఫఏరువాక అమ్మవారి ఆలయం,చౌడేశ్వరీదేవి ఆలయం, చిలమకూరు లోని శ్రీదేవిభూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం, ఎర్రగుంట్ల, చిలమ కూరులోని ఉమా మహేశ్వరాలయాల్లోను దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఆలయాలకు వచ్చిన భక్తులకు ప్రసా దాలతోపాటు దర్శన ఏర్పాట్లు చేశారు. 

జమ్మలమడుగు రూరల్‌..: జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో దసరా శరన్నవరాత్రుల పండుగను పురస్కరించుకుని ఆలయాలు ముస్తాబయ్యాయి. అందులో భాగంగా పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం, శ్రీ మదాంబ భవానీ ఆలయం, ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయం, నాగులకట్ట చౌడేశ్వరీదేవి, ముద్దనూరు రోడ్డులోని సాయిబాబా ఆలయం, కోవెలకుంట్ల రోడ్డులోని సాయిబాబా ఆలయాల్లో తదితర   ఏర్పాట్లు చేశారు. 26వ తేదీ సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రులు, పూజా కార్యక్రమాలు, అలంకారాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల కమిటీవారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ప్రొద్దుటూరు టౌన్‌..: దసరా పండుగ సందర్భంగా పాతమార్కెట్‌లోని లలితాదేవి, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు అమ్మవారికి విశేష అలంకరణలు చేయనున్నారు. ఈ ఆలయంలో 9 రోజులపాటు బొమ్మల కొలువులను కొలువుదీర్చనున్నారు. భక్తులు బొమ్మల కొలువు తిలకించడానికి అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ప్రతి రోజు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడంతోపాటు లోకకల్యాణార్థం హోమాలను నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 

మైదుకూరు రూరల్‌..: మైదుకూరులో దసరా ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి. మైదుకూరులోని అమ్మవారిశాల, పాత సాయిబాబా ఆలయం, పెద్దమ్మతల్లి, జీవీ సత్రంలోని అమ్మవారుశాలలో దసరా వే డుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.మైదుకూరులో నాలుగు రోడ్లు కూ డా లైటింగ్‌ బోర్డులతో వెలిగిపోతున్నాయి. గతంలో కంటే మరింత ఘనంగా అమ్మవారిశాలలో ఏర్పాట్లు సాగుతున్నాయి.  

Updated Date - 2022-09-26T04:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising